Viral:రొయ్యను తిందామనుకున్న యువతి.. చివరకు ఊహించని ట్విస్ట్? (వీడియో)

ఇటీవల కాలంలో చాలామంది వెరైటీ ఫుడ్స్ ట్రై చేస్తూ వింత అనుభూతిని పొందుతున్నారు.

Update: 2024-08-14 15:25 GMT

దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో చాలామంది వెరైటీ ఫుడ్స్ ట్రై చేస్తూ వింత అనుభూతిని పొందుతున్నారు. అంతేకాకుండా వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయాన్ని కలిగిస్తుంటాయి. అదేంటీ ఆహార వీడియోలు భయాన్ని కలిగించడం ఏంటనీ ఆశ్చర్యపోతున్నారా.. అవును ఇటీవల ఎంతో మంది బతికున్న చేపలు, రొయ్యలు, పచ్చి మాంసం, బొద్దింకలు, ఆక్టోపస్ వంటి వాటిని తినేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో అవి చూసిన వారు ఛీ అంటుకుంటూ ఉంటారు.

అయితే ఇలాంటివన్నీ చైనా వాళ్లే ట్రై చేస్తుంటారన్న విషయం తెలిసిందే. ఒక్కోసారి పచ్చి కూరగాయలు, మాంసం, చిన్న కీటకాలను వేడి నీటిలో కూడా వేసుకుని తింటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ యువతి బతికున్న ఓ పెద్ద రొయ్యను వేడి నీటిలో వేసి తినాలని అనుకుంది. కానీ అంతలోనే అది కిందపడిపోయింది. దీంతో ఆమె దాన్ని చాప్ స్టిక్స్‌తో పట్టుకుని వేయబోతుండగా.. చేతిని గట్టిగా పట్టేసుకుంది.

ఇక చేతిని వదలకుండా కొరికేసింది. ఇక అది గమనించిన హోటల్ సిబ్బంది ఆమె దగ్గరకు వచ్చి రొయ్యను వదిలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. అది కాసేపటి వరకు ఆమె చేతిని కొరకడంతో.. లబోదిబోమంటూ ఏడ్చేసింది. చివరకు దాన్ని తీసి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఇక ఇదంతా వీడియో తీసిన యువతి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. నన్నే తింటావా అని రొయ్య కోపంతో అలా చేసిందని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News