పడుకునేటప్పుడు బాయ్ ఫ్రెండ్ చేసే సౌండ్స్‌ను రికార్డ్ చేసి అమ్ముకుంటున్న ప్రియురాలు
అమ్మకానికి ఏదీ కాదు అనర్హం అని నిరూపించింది ఓ యువతి.
దిశ, వెబ్‌డెస్: అమ్మకానికి ఏదీ కాదు అనర్హం అని నిరూపించింది ఓ యువతి. ఈ కామర్స్‌లో ఆన్ లైన్ కొనుగోళ్లు పెరిగిపోవడంతో గ్రామాల్లో ఉచితంగా లభించే మామిడి ఆకు, పిడకలు, పచ్చిగడ్డి ఇలా ప్రతిదీ విక్రయిస్తున్నారు. ఇదే మాదిరిగా ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ చేసే సౌండ్స్‌ను రికార్డ్ చేసి ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టి నెట్టింటా హాట్ టాపిక్‌గా నిలిచింది. ఆమె చేసిన పనికి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.
అనా మల్పెయిర్ (26), లూయిస్ (33) గత ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారు లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు. అయితే లూయిస్ పడుకునేటప్పుడు ఎక్కువగా గురక పెట్టేవాడు. దీంతో తన ప్రేయసి అనా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. ఇదే విషయాన్ని తన బాయ్ ఫ్రెండ్‌కి చెప్పినప్పటికీ తను అది నమ్మేవాడు కాదు. నేను గురక పెట్టలేదు అని చెప్పేవాడు. అయితే ఆ సౌండ్‌ను తనకు వినిపించాలని ఆమె తన బాయ్ ఫ్రెండ్ గురకని ఫోన్లో రికార్డ్ చేసేది. ఇలా తనకి అలవాటుగా మారడంతో రోజు పడుకునేటప్పుడు లూయిస్ గురకని ఫోన్లో రికార్డు చేసేది.
సంవత్సరం మొత్తం రికార్డు చేసిన గురక శబ్దాలను స్నేహితులైన సంగీత విద్వాంసులకు వినిపించింది అనా. వారిలో ఒకరు ఆమెకు ఓ ఐడియా ఇచ్చారు. Spotify లో వీటిని అప్లోడ్ చేయమని చెప్పారు. ఆ ఐడియా నచ్చి Spotify లో అప్లోడ్ చేసింది అనా. అనుకోకుండా ఆ శబ్ధాలు ప్రజలకు బాగా నచ్చాయి. ఇప్పటి వరకు దాదాపు 16 వేలకు మంది ఆ గురకను విన్నారు. ఈ రకంగా అనా డబ్బులు సంపాదిస్తుంది. అలా బాయ్ ఫ్రెండ్ గురక సౌండ్‌ను అమ్ముకుని ప్రియురాలు డబ్బును సంపాదించడాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.