ఫుల్ జోష్ తో దాండియా ఆడిన అవ్వ తాత.. వాళ్ల ముందు యువత ఎనర్జీ కూడా సరిపోదంతే...

నవరాత్రుల్లో దేశమంతా గర్బా రంగుల్లో మునిగిపోయింది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ గర్బా ఆడటంలో మునిగిపోయారు.

Update: 2024-10-10 08:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : నవరాత్రుల్లో దేశమంతా గర్బా రంగుల్లో మునిగిపోయింది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ గర్బా ఆడటంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించి పలు చోట్ల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వృద్ధ దంపతుల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసి యువ జంటలు కూడా వామ్మో నా వల్ల కాదనేస్తున్నారు.

ప్రతిభకు వయస్సుతో పనిలేదని, ప్రతిభ మనిషిని ఏ వయసులోనూ వదలదని అంటారు. ఇప్పుడు వృద్ధ జంట బహిరంగంగా డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియోను చూసిన వారంతా అదే మాట అంటున్నారు. ఆ వృద్ధ జంట చేసిన గర్బా డాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ మెస్మరైజ్ అవ్వాల్సందే. అంతే కాదండోయ్ ఈ అవ్వతాతలతోడాన్స్ చేసేందుకు యూత్ కి కూడా తమ ఎనర్జీ సరిపోవడం లేదంటున్నారు.

ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా ఈ వీడియోలో అవ్వ తెలుపు, నీలం రంగు ఘాగ్రా ధరించి ఉండగా, తాత ధోతీ, జాకెట్ ధరించి ఇద్దరి జంట అద్భుతంగా ఉంది. వారి డాన్స్ కూడా పాటకు తగినట్టుగా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వచ్చిన వెంటనే వైరల్‌గా మారింది. ప్రజలు దానిని తమ స్నేహితులు, బంధువులకు షేర్ చేసుకోవడం కనిపిస్తుంది. ఈ వీడియో @Atulya_Bharat1 అనే ఖాతా ద్వారా Xలో భాగస్వామ్యం అయ్యింది.


Similar News