ఇదెక్కడి మాస్ రా మావ.. మురికి కాల్వలోనే లవర్‌తో రొమాన్స్!

ఇటీవల కాలంలో ఫొటో షూట్‌ల సందడి ఎక్కువైంది. ఏ శుభ కార్యక్రమం జరిగినా స్పెషల్ ఫొటో షూట్ ఉండాల్సిందే.

Update: 2023-04-26 11:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కాలంలో ఫొటో షూట్‌ల సందడి ఎక్కువైంది. ఏ శుభ కార్యక్రమం జరిగినా స్పెషల్ ఫొటో షూట్ ఉండాల్సిందే. ఇక పెళ్లిల విషయానికి వస్తే ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, సాంగ్ షూటింగ్ అంటూ హంగామా చేస్తున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని జంటలు చేసే ఫొటో షూట్లు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటుంటే మరి కొన్ని ఆలోచింపచేసేవిగా ఉంటున్నాయి.

 

తాజాగా ఓ జంట ఫొటో షూట్ వైరల్ అవుతోంది. మిగతా వారి కంటే ఓ అడుగు ముందుకు వేసిన ఈ జంట ఏకంగా మురికి కాల్వలోనే ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ జంట ఎవరు? ఈ మురికి కాల్వ ఎక్కడిది అనే వివరాలు తెలియనప్పటికీ ఈ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ‘రేయ్.. ఎవర్రా మీరంతా’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఫొటో షూట్ పేరుతో ఇవేం చేష్టలురా బాబు అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News