Pain Killer:పెళ్లి ఆపిన పెయిన్ కిల్లర్ ఇంజక్షన్..

మనలో చాలా మంది చిన్నచిన్న నోప్పులుకు అంటే ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి చిన్నచిన్న సమస్యలకు సైతం ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్‌లు తీసుకుంటూ ఉంటారు.

Update: 2024-06-29 15:50 GMT

దిశ వెబ్ డెస్క్: మనలో చాలా మంది చిన్నచిన్న నోప్పులుకు అంటే ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి చిన్నచిన్న సమస్యలకు సైతం ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్‌లు తీసుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా నొప్పికి ఇచ్చే ఇంజక్షన్‌ను నరానికి ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. అయితే చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదే మనకుఉండే రక్తనాలల్లో దేనికి ఇస్తారు అనేది. మనిషి రక్తనాళాల్లో సిరలు, ధమనులు అని రెండుంటాయి.

కాగా సిరలు చర్మంకిందే ఉండి పైకి ఉబ్బెత్తుగా కనిపిస్తాయి. కాగా సిరల్లో కండరాలు ఉండవు. ఇక ధమనుల విషయానికి వస్తే.. చర్మంకి కింద బాగా లోతుగా ఉంటాయి. అలానే ధమనుల్లో కండరాలు ఉంటాయి. సాధారణంగా ఇంజెక్షన్‌లు సిరలకు ఇస్తారు. పొరపాటున ధమనుల్లో ఇస్తే వాటిలో ఉండే కండరాల్లు సంకోచించి ఆ భాగం సచ్చు బడిపోతుంది. తాజాగా అలాంటి ఘటనే చేటుచేసుంది. ఓ మహిళ (32) నొప్పులకు ఇంజెక్షన్ తీసుకునేందుకు డాక్టర్ వద్దకు వెళ్లింది.

ఈ నేపథ్యంలో డాక్టర్ ఆమెకు ఇంజక్షన్ ఇచ్చారు. అయితే ఇంజక్షన్ ఇచ్చే సమయంలో సూది కొంచం లోపలికి వెళ్లి ఇంజక్షన్‌లోని మందు ధమనుల్లోకి వెళ్లింది. దీనితో ఆ ధమనిలో ఉండే కండరాలు సంకోచించి ఆ చెయ్యికి మోచేయి కింద నుండి రక్తప్రసరణ ఆగిపోయింది. చివరికి ఆ చేయ్యి తీసేయాల్సి వచ్చిందని ఓ డాక్టర్ ట్వీట్ చేశారు. కాగా ట్వీట్‌కు మరో డాక్టర్ రీట్వీట్ చేశారు.

రేపు పెళ్లి ఉండాగా ఓ వ్యక్తి ముందు రోజు సాయంత్రం ఆరెంపీ దగ్గర నొప్పికి ఇంజక్షన్ తీసుకున్నాడు. అయితే ఆ ఆరెంపీ ఇంజెక్షన్‌ ఇచ్చే సమయంలో సూది కాస్తా లోపలికి వెళ్లి ఇంజెక్షన్‌లోని మందు ధమనుల్లోకి వెళ్లింది. దీనితో వెంటనే ధమనిలో ఉండే కండరాలు సంకోచించి ఆ చెయ్యికి మోచేయి కిందనుండి రక్తప్రసరణ ఆగిపోయింది. దాంతో అతను విపరీతమైన నొప్పితో విలవిలలాడిపోయాడని.. ఈ నేపథ్యంలో అతన్ని తన దగ్గరికి తీసుకొచ్చారని తెలిపారు.

ఈ క్రమంలో తాను పరీక్ష చేయగా ఇంజెక్షన్ చేసిన చెయ్యి పాలిపోయి, అందులో పల్స్ తెలీడంలేదని పేర్కొన్నారు. అంటే పూర్తిగా ధమనులు బ్లాక్ అయిపోయాయి అని.జ దాంతో ఆ చెయ్యి మొత్తానికి ఆక్సిజన్ అందటం లేదని.. ఇది నెక్రోటిక్ గ్యాంగ్రీన్ కి దారిదీస్తుందని తనకు అర్ధమైందని. అయితే వైద్యం చెయ్యటానికి తాను సర్జన్‌ను కాదని, అలానే తన దగ్గర లేవని.. ఇదే విషయాన్ని పేషంట్ కుటుంబ సబ్యులకు చెప్పి విశాఖపట్నంలోని ఓ ప్రముఖ వాస్క్యులర్ సర్జన్కి రిఫర్ చేసినట్టు తెలిపారు.

కాగా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునే సయమానికి ఆలస్యం అవటం వలన అతని చిటికెనవేలు, ఉంగరంవేలు పూర్తిగా చనిపోయాయని తెలిపారు. దీనితో సర్జరీ చేసి వాటిని తొలగించారని పేర్కొన్నారు. దీనితో అతని పెళ్లి సైతం ఆగిపోయిందని తెలిపారు. అయితే ఈ అమ్మాయి విషయంలో బాగా ఆలస్యం అయిందని. కావున ఈ అమ్మాయి చెయ్యి తీసేస్తారని, ఇది చాలా బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సన్నివేశాలు గ్రామాల్లో కోకొల్లలు. తస్మాత్ జాగ్రత్త అంటూ రీట్వీట్ చేశారు ఓ డాక్టర్.


Similar News