బిందెలో ఇరుక్కున్న చిరుత! నీటి కోసం నరక యాతన!
మహారాష్ట్ర, ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి చిరుత ప్రవేశించింది. ఈ క్రమంలోనే అది గ్రామంలో ఉన్న ఓ పశువుల కొట్టంలోకి చిరుత దూరింది.
దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర, ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి తాజాగా చిరుత ప్రవేశించింది. ఈ క్రమంలోనే అది గ్రామంలో ఉన్న ఓ పశువుల కొట్టంలోకి చిరుత దూరింది. ప్రమాదవశాత్తు ఆ చిరుత అక్కడే ఉన్న ఓ బిందెలో తల పెట్టడంతో తల ఇరుక్కుపోయింది. ఇది గమనించిన స్థానికులు ఫారెస్ట్ సిబ్బందికి తెలిపారు.
ఫారెస్ట్ సిబ్బంది చిరుతకు మత్తుమందు ఇచ్చి బిందెను కట్ చేసి చిరుతను రక్షించి అడవిలో వదిలేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మారుతున్న వాతావరణం, ఎండ తీవ్రత వల్ల ఉండటంతో జంతువులకు అడవిలో నీళ్లు దొరకడం కష్టంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నీరు తాగేందుకు బిందెలో తల పెట్టి ఇరుక్కుపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.