వార్త‌లు చ‌దువుతుంటే గొంతులోకి దూరిన ఈగ‌.. ఇప్పుడెలా..?! (వీడియో)

ఈ న్యూస్‌ యాంకర్ విష‌యంలోనే అలాగే జ‌రిగింది. Farah Nasser was caught on air when a bug flew into her mouth.

Update: 2022-09-02 13:55 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః న్యూస్ యాంకర్‌గా ఉండటం అంటే అందంగా, ఆకర్షణీయంగా ఉంటే స‌రిపోతుంది, అది చాలా తేలికైన పనిగా కొంద‌రు అనుకోవ‌చ్చు. నిజానికి, ఏదైనా బ్రేకింగ్ న్యూస్‌ని కెమెరా ముందు ప్ర‌జెంట్ చేయాలంటే, అందులోనూ ప్రత్యక్ష ప్ర‌సారంలో మాట్లాడాలంటే కొన్ని ఇబ్బందుల్ని త‌ట్టుకోవాల్సి ఉంటుంది. క‌వ‌ర్ చేసుకొని, నార్మ‌ల్‌గా ఉన్న‌ట్లే వార్త‌లు కొన‌సాగించాల్సి ఉంటుంది. అయితే, ఒక్కోసారి సంభ‌వించే హ‌ఠాత్ప‌రిణామాలకు ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నా మ‌న స్థితి స్ప‌ష్టంగానే తెలిసిపోతుంది. సరిగ్గా, ఈ న్యూస్‌ యాంకర్ విష‌యంలోనే అలాగే జ‌రిగింది.

కెనడియన్ న్యూస్ ఛానెల్ గ్లోబల్ న్యూస్‌కి న్యూస్ యాంకర్ అయిన ఫరా నాసర్ అనే జర్నలిస్ట్ పాకిస్థాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్న‌ కుండపోత వర్షాల గురించి లైవ్‌లో వార్త‌లు చ‌దువుతుండ‌గా ఆమె నోటిలోకి బగ్ దూరింది. అప్పుడు ఆమె ప‌డిన ఇబ్బందిని త‌న ట్విట్ట‌ర్ పేజీలో షేర్ చేశారు. "పాకిస్థాన్ ఎప్పుడూ ఇలాంటి ప‌రిస్థితిని చూడలేదు. ఎనిమిది వారాలు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం. జాతీయ ఎమర్జెన్సీ విధించబడింది…" అని నాజర్ తన వార్తా నివేదికలో చెబుతుంది. అయితే, అప్పుడే, ఒక వాక్యం మధ్యలో బగ్ ఆమె నోటిలోకి ఎగురుతుంది. ఆమె దానిని మింగి, తన వాక్యాన్ని ముగించి, వార్త‌ని కొనసాగిస్తుంది. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ, "ఈ రోజుల్లో మనందరికీ నవ్వడం అవసరం కాబట్టి ఇది షేర్ చేస్తున్నాను. ఇది కేవలం @fordnation మాత్రమే కాదు, నేను ఈరోజు గాలిలో ఉన్న‌ ఒక ఫ్లైని మింగాను. (నేను పరిచయం చేస్తున్న కథను బట్టి ఇది చాలా మొదటి ప్రపంచ సమస్య)" అని వెల్ల‌డించింది.


Similar News