సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. చూసేందుకు ఎగబడుతున్న జనం (వీడియో వైరల్)
సముద్రంపై ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల ఒక్కోసారి ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి.
దిశ, వెబ్‌డెస్క్: సముద్రంపై ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల ఒక్కోసారి ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. కొన్నిసార్లు ధ్వంసమైన పడవలు, అంతు చిక్కని వస్తువులు సముద్ర తీరానికి చేరుతాయి. ఈ క్రమంలోనే ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో వింత చోటుచేసుకుంది. ఇచ్చాపురం మండల పరిధిలోని డోంకురు సముద్ర తీర ప్రాంతానికి ఓ భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. దీంతో స్థానికులు ఈ చిత్రాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల పాఠశాలల నుంచి విద్యార్థులు సముద్ర తీరానికి చేరుకుని తిమింగలంపై ఎగురుతూ ఆటాలాడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, డోంకురు తీరప్రాంతానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగళం.
— BIG TV Breaking News (@bigtvtelugu) February 27, 2024
భారీ తిమింగళాన్ని చూసేందుకు ఎగబడుతున్న స్థానికులు.
#Srikakulam #thimingalam #NewsUpdate #bigtvlive pic.twitter.com/AvwnkAqfXA