Telangana Secretariat : తెలంగాణ సచివాలయం ‘బాహుబలి’ గేటు తొలగింపు
తెలంగాణ రాష్ట్ర సచివాలయం బాహుబలి గేటును తొలగించారు. ఈ గేటును హుస్సేన్ సాగర్ గేట్ నెంబర్ 3 వద్ద పెట్టనున్నట్లు తెలుస్తున్నది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సచివాలయం (Dr. B.R. Ambedkar Telangana State సెక్రటేరియట్) బాహుబలి గేటును తొలగించారు. ఈ గేటును హుస్సేన్ సాగర్ గేట్ నెంబర్ 3 వద్ద పెట్టనున్నట్లు తెలుస్తున్నది. సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్న క్రమంలో భాగంగా మార్పులు చేపట్టారు. ఇప్పటికే ఈ మెయిన్ గేట్‌ను రేకులతో మూసివేశారు. కొత్తగా ఏర్పాటు చేసే గేటు దగ్గర కూడా పనులకు ఇబ్బంది రాకుండా రేకులతో మూసివేశారు.
అయితే, గత బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిన తెలంగాణ సెక్రటేరియట్‌లో వాస్తు దోషం ఉందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో బహుబలి గేటుగా పిలిచే మెయిన్ ఎంట్రెన్స్‌కు తాళం వేసిస దాదాపు 6 నెలలు మూసివేశారు. తాజాగా గేటును తొలిగించారు.