పులి వేట నుంచి సులభంగా తప్పించుకున్న బాతు.. రెండున్నర కోట్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్

పులులు సాధారణంగా ఒంటరిగా వేటాడతాయి. ఇతర పిల్లుల మాదిరిగానే తమ వేటపై ఒక్కుదుటున, ఆకస్మికంగా దాడి చేసి, ఏ కోణం నుంచైనా వాటిని ఆక్రమించి, లోబరచుకుంటాయి.

Update: 2024-01-23 04:44 GMT

దిశ, ఫీచర్స్: పులులు సాధారణంగా ఒంటరిగా వేటాడతాయి. ఇతర పిల్లుల మాదిరిగానే తమ వేటపై ఒక్కుదుటున, ఆకస్మికంగా దాడి చేసి, ఏ కోణం నుంచైనా వాటిని ఆక్రమించి, లోబరచుకుంటాయి. తమ శరీర పరిమాణాన్ని, బలాన్ని ఉపయోగించి ఎరను పడవేస్తాయి. సాధారణంగా ఒక్కుదుటున తన వేట పైకి దూకి, దానిని పడేసి, గొంతును గానీ, మెడను గానీ దంతాలతో పట్టేసుకుంటుంది. జంతువుల వెనుక మాటు వేసి దాడి చేస్తాయి. ఆహారం కోసం అడవిలో ఉండే సింహం, చిరుత పులి, పులి ఇతర జంతువుల పై దాడి చేసి ఆహారాన్ని దక్కించుకుంటాయి.

అయితే కొన్నిజంతువులు చిన్న చిన్న ఉపాయాలతో తమ ప్రాణాలను కాపాడుకుంటాయనడానికి ఓ వీడియో నిదర్శనంగా మారింది . తాజాగా పులి వేట నుంచి ఎంతో తెలివిగా తప్పించుకున్న బాతు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో చూసుకున్నట్లైతే.. జూలో ఉన్న ఒక చెరువులో బాతు హాయిగా నిద్రిస్తుంది. ఈదుతున్న బాతును ఆహారంగా మలచుకోవాలని.. పులి చప్పుడు లేకుండా వాటర్ లోకి ప్రవేశిస్తుంది. వెంటనే బాతు ఈ విషయాన్ని గమనించి.. అప్రమత్తవుతుంది.తనపై పులి దూసుకొస్తున్న విషయాన్ని గమనించిన బాతు కన్ను మూసి తెరిచేలోగా వాటర్ లో మునిగిపోయి పులిని కన్ఫ్యూజ్ చేస్తుంది.

పులి కళ్ల ముందే బాతు నీటిలో మునిగి అదృశ్యమవడంతో పులి అయోమయంగా చూస్తుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ‘‘పులి ముందు బాతు ఎంతో చిన్నది. పులి.. బాతును ఆహారంగా మలచుకోవాలంటే దానికి ఒక్క నిమిషం చాలదు. కానీ బాతు ఇంత తెలివిగా తప్పించుకుంది అంటే చాలా తెలివైనది అంటూ బాతు పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోకు ప్రస్తుతం 2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇంకా ట్రెండింగ్‌లో ఉండటం విశేషం.


Similar News