బతికున్న పాముతో ప్రీ వెడ్డింగ్ షూట్.. ఫొటోస్ వైరల్

ఇటీవల కాలంలో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేయడం కామన్ అయిపోయింది.

Update: 2023-06-02 05:20 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేయడం కామన్ అయిపోయింది. పెళ్లి చేసుకోబోయే జంటలు తమ భాగస్వామితో మధురమైన జ్ఞాపకాలను జీవితమంతా గుర్తుండి పోయేలా ఉంచుకోవాలని ఈ ఫొటో షూట్స్ చేస్తుంటారు. కానీ, కొన్ని షూట్స్ ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి.

తాజాగా, మరో జంట విచిత్రంగా పాముతో ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఓ జంటను పాము ఎలా కలిపిందనే విషయాన్ని ఈ ఫొటోలు వెల్లడిస్తాయి. ఇందులో అసలు విషయానికి వస్తే. యువతి నడుచుకుంటూ వస్తుండగా ఆమెకు పాము ఎదురవుతుంది. దీంతో ఆమె భయపడి పోయి రెస్క్యూ సర్వీసుకు కాల్ చేసి పిలిపించింది. ఇందులో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి.. అందులో ఓ వ్యక్తి యువతి వైపు చూసి నవ్వడం కనిపిస్తుంది. ఆపై వారు పామును పట్టుకుని ఓ బాక్స్‌లో వేసుకుని వెళ్తూ యువతిని ఫోన్ చేయమని సైగ చేస్తాడు. ఆ తర్వాత వారు ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేమలో పడిపోతారు. ఈ జంటను పాము కలిపిందని తెలియజేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు. కానీ, ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News