లేటు వయసు ఘాటు ప్రేమ.. 104 ఏండ్ల బామ్మతో ప్రేమలో పడ్డ 48 ఏండ్ల వ్యక్తి..

ప్రేమ గుడ్డిది అని అంటారు. అందుకే కాబోలు ఓ వ్యక్తి తన కంటే 58 ఏళ్లు పెద్దదైన మహిళతో గాఢమైన ప్రేమలో పడ్డాడట.

Update: 2024-04-18 10:10 GMT

దిశ, ఫీచర్స్ : ప్రేమ గుడ్డిది అని అంటారు. అందుకే కాబోలు ఓ వ్యక్తి తన కంటే 58 ఏళ్లు పెద్దదైన మహిళతో గాఢమైన ప్రేమలో పడ్డాడట. అందేంటి ఒకటి, రెండు సంవత్సరాల తేడా లేదా ఓ 10 సంవత్సరాల తేడానో ఉంటే ఓకే కాని మరి 58 ఏండ్ల డిఫరెన్స్ అనుకుంటున్నారు కదా. ఇంతకీ ఈ లేటు వయసు ఘాటు ప్రేమాయణం ఎక్కడ జరిగింది, దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐరోపా దేశమైన ఎస్టోనియాకు చెందిన 48 ఏళ్ల మార్క్ సోసన్‌ను ఆస్ట్రేలియాకు చెందిన 104 ఏళ్ల ఎల్ఫ్రిడా రీట్ ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి చూపులోనే వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. దాంతో వారిద్దరూ ప్రేమ పక్షులలా కలిసి జీవించి చనిపోతామని ప్రతిజ్ఞలు కూడా చేసుకున్నారట. ప్రస్తుతం ఈ వింత ప్రేమకథ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

అయితే ఈ విలక్షణమైన ప్రేమ కథకు ప్రస్తుతం తెరపడింది. ఎందుకంటే గత శనివారం ఆల్ఫ్రెడో ప్రపంచానికి శాశ్వతంగా వీడ్కోలు పలికింది. మార్క్, ఆల్ఫ్రెడ్ ల ప్రేమ కథ గురించి తెలుసుకున్న నెటిజన్లు కూడా భావోద్వేగానికి గురయ్యారు. మరి వీరిద్దరూ ఎలా కలిశారు ఇప్పుడు తెలుసుకుందాం.

వృత్తి రీత్యా న్యాయవాది అయిన మార్క్, తాను ఆంగ్లం నేర్చుకునేందుకు ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు అక్కడ తొలిసారిగా ఎల్ఫ్రిడా కలిశానని చెప్పాడు. ఎల్ఫ్రిడాను చూడగానే ప్రేమలో పడ్డానని చెప్పాడు. తమ వయసు తేడా తనకు బాగా తెలుసని, కానీ తొలి చూపులోనే ప్రేమ కలిగిందని మార్క్ చెప్పాడు. ఎస్టోనియాలో నివసిస్తున్నప్పటికీ, అతను ఎల్ఫ్రిడాను కలవడానికి ఆస్ట్రేలియాకు వెళ్లేవాడని తెలిపారు.

అయితే, ఎస్టోనియాలో జన్మించిన ఎల్ఫ్రీడ్ మార్క్ పినఅమ్మమ్మ. మార్క్ దాదాతో ఆమె సంబంధం ఎక్కువ కాలం కొనసాగలేదట. ఆ తర్వాత ఆమె ఆస్ట్రేలియా వెళ్లింది. తన తాత చనిపోయాక, ఈ వృద్ధురాలితో 11 ఏళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నానని మార్క్ ఇటీవల మీడియాతో చెప్పాడు. 2022 వరకు కలిసి ఉంటామని చెప్పారు. అయితే ఎల్ఫ్రిడా బలవంతంగా నర్సింగ్‌హోమ్‌కు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.

ఎల్ఫ్రిడా లేకుండా తన జీవితం అసంపూర్ణం అని ఆ వ్యక్తి చెప్పాడు. వారి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేకపోయినా, భార్యాభర్తల లాంటి ఎమోషనల్ రిలేషన్ షిప్ ఉండేదట. మార్క్ తన లా ప్రాక్టీస్ వదిలి ఎల్ఫ్రిడాతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాడు. అతను 2018లో శాశ్వత వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అది సాధ్యం కాలేదట. ఎందుకంటే అతను ఎల్ఫ్రిడా భాగస్వామి అని కోర్టులో నిరూపించలేకపోయాడు.

Tags:    

Similar News