రైల్వే ప్రయాణికులకు షాక్.. ఆ రైళ్లు రద్దు
దిశ, వెబ్‌డెస్క్ : భారీ వర్షాలతో అటు తమిళనాడు ఇటు ఏపీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే ఏపీలో కొన్ని ప్రాంతాలలో వరదల కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా జరిగింది. దాని నుంచి కోలుకోకముందే ఏపీని సైక్లోన్ తుఫాన్ భయపెడుతోంది. ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. డిసెంబర్ 3న ఇది తుఫాన్‌గా మారనుందని దీనికి జవాద్ గా నామకరణం చేసినట్టు వాతావరణ శాఖ అధికారులు […]
దిశ, వెబ్‌డెస్క్ : భారీ వర్షాలతో అటు తమిళనాడు ఇటు ఏపీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే ఏపీలో కొన్ని ప్రాంతాలలో వరదల కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా జరిగింది. దాని నుంచి కోలుకోకముందే ఏపీని సైక్లోన్ తుఫాన్ భయపెడుతోంది. ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. డిసెంబర్ 3న ఇది తుఫాన్‌గా మారనుందని దీనికి జవాద్ గా నామకరణం చేసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ హెచ్చరికతో తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయ్యింది. నేటి నుంచి మూడు రోజుల పాటు 95 రైళ్లను రద్దు చేశారు.