అలర్ట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
దిశ, వెబ్‌డెస్క్ : ఈనెల 9వ(శుక్రవారం) నుంచి ఆషాఢమాసం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆషాఢమాస బోనాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదివారం(జూలై 11) నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు హైదరాబాద్‌లో బోనాల పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం గోల్కోండ జగదాంబిక అమ్మవారికి ఈ ఏడాది తొలి బోనం సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు జరగనుంది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్.. బగ్గీపై ఊరేగింపుగా వచ్చి […]
దిశ, వెబ్‌డెస్క్ : ఈనెల 9వ(శుక్రవారం) నుంచి ఆషాఢమాసం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆషాఢమాస బోనాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదివారం(జూలై 11) నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు హైదరాబాద్‌లో బోనాల పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం గోల్కోండ జగదాంబిక అమ్మవారికి ఈ ఏడాది తొలి బోనం సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు జరగనుంది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్.. బగ్గీపై ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
అయితే, బోనాల పండుగ సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు తగు ఏర్పాట్లు చేశారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫతే దర్వాజ మీదుగా లంగర్‌హౌజ్ -గోల్కొండ కోట, మక్కాయి దర్వాజ మీదుగా రామ్‌దేవ్‌గూడ – గోల్కొండ కోట, బంజారా దర్వాజ మీదుగా సెవెన్ టూంబ్స్ – గోల్కొండ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులను విధించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయి.