నో మాస్క్.. ట్రాఫిక్ పోలీసుకు రూ. 2వేల జరిమానా

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా ప్రజలందరూ మాస్కు ధరించి, కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు, వైద్యులు చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మాస్క్ ధరించని వారికి ఫైన్లు కూడా వేస్తున్నారు. తాజాగా ఒడిశాలోని పూరీ జిల్లాలో మాస్క్​ ధరించని ఓ ట్రాఫిక్​ కానిస్టేబుల్‌కు రూ. 2వేల జరిమానా విధించారు అధికారులు. పూరీలోని బడాదండా గ్రామంలో మాస్క్​ ధరించకుండా ఓ కానిస్టేబుల్​ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో అధికారులు అతనికి జరిమానా […]

Update: 2021-04-14 00:11 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా ప్రజలందరూ మాస్కు ధరించి, కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు, వైద్యులు చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మాస్క్ ధరించని వారికి ఫైన్లు కూడా వేస్తున్నారు. తాజాగా ఒడిశాలోని పూరీ జిల్లాలో మాస్క్​ ధరించని ఓ ట్రాఫిక్​ కానిస్టేబుల్‌కు రూ. 2వేల జరిమానా విధించారు అధికారులు. పూరీలోని బడాదండా గ్రామంలో మాస్క్​ ధరించకుండా ఓ కానిస్టేబుల్​ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో అధికారులు అతనికి జరిమానా విధించారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

Tags:    

Similar News