ఉప్పొంగిన మొండివాగు.. వరదల్లో కొట్టుకుపోయిన ట్రాక్టర్
దిశ, నిజామాబాద్ రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, గులాబ్ తుఫాన్ నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టడం లేదు. రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలం కొండాపూర్ అడవి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో అడవి ప్రాంతంలో ఉన్న మొండి వాగు ఉప్పొంగింది. ఇదే సమయంలో సిరికొండ మండల కేంద్రానికి వెళ్తున్న ట్రాక్టర్.. వాగును దాటే ప్రయత్నంలో ఉధృతి పెరగడంతో కొట్టుకుపోయింది. కాగా, డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా […]
దిశ, నిజామాబాద్ రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, గులాబ్ తుఫాన్ నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టడం లేదు. రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలం కొండాపూర్ అడవి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో అడవి ప్రాంతంలో ఉన్న మొండి వాగు ఉప్పొంగింది. ఇదే సమయంలో సిరికొండ మండల కేంద్రానికి వెళ్తున్న ట్రాక్టర్.. వాగును దాటే ప్రయత్నంలో ఉధృతి పెరగడంతో కొట్టుకుపోయింది. కాగా, డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇది ఇలా ఉంటే ట్రాక్టర్ కొట్టుకుపోవడంతో తన పరిస్థితి ఏంటని యజమాని లబో దిబో మన్నాడు.