ఇది రైతులు సాధించిన విజయం.. టీఆర్ఎస్‌కు రేవంత్ చురకలు

దిశ, తెలంగాణ బ్యూరో : నల్ల వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కు తగ్గడం ముమ్మాటికి దేశ రైతాంగ విజయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 13 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు అకుంటిత దీక్షతో చేసిన పోరాటం వల్లే విజయం సాధించారన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి.. నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా పోరాటం చేయడం హర్షనీయమని అన్నారు. దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా పోరాటం చేస్తారో, అదే స్ఫూర్తితో రైతులు ఉద్యమం చేశారని తెలిపారు. […]

Update: 2021-11-19 01:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నల్ల వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కు తగ్గడం ముమ్మాటికి దేశ రైతాంగ విజయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 13 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు అకుంటిత దీక్షతో చేసిన పోరాటం వల్లే విజయం సాధించారన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి.. నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా పోరాటం చేయడం హర్షనీయమని అన్నారు. దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా పోరాటం చేస్తారో, అదే స్ఫూర్తితో రైతులు ఉద్యమం చేశారని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందలాది మంది రైతుల ప్రాణాలు పోవడానికి కారణమైన ప్రధాని మోడీని రైతులు క్షమించరని అన్నారు. ఇందిరా గాంధీ పుట్టిన రోజున నల్ల చట్టాల రద్దుతో రైతులు విజయం సాధించారని అన్నారు. రైతు ఉద్యమాలకు కాంగ్రెస్ అండగా నిలబడిందని అన్నారు. దేశంలో గుజరాత్ నుండి బయలు దేరిన నలుగురు వ్యక్తులు దేశాన్ని ఆక్రమించుకోవాలని చూశారని ఆరోపించారు. ప్రధాని మోడీ వ్యవసాయ రంగాన్ని అదాని, అంబానీకి అమ్మకానికి పెట్టాలని చూస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ అసెంబ్లీలో కూడా రైతు చట్టాలు వ్యతిరేకంగా కేసీఆర్ తీర్మానం చేయాలని డిమాండ్ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో నల్ల వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఓటు వేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సభలో చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసే ధైర్యం కేసీఆర్‌కు లేదు కానీ.. ఈ క్రెడిట్ మాదే అని టీఆర్ఎస్ నేతలు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలా చెప్పుకోవడం రైతులను అవమానించడమే అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ వ్యవహరం ఎలా ఉందంటే ఎవడికో పుట్టిన పిల్లకు.. ఎవడో కుల్ల కుట్టించినట్టు ఉందని ఎద్దెవ చేశారు.

సాధారణ వ్యక్తిలా ఆటోలో హోటల్‌కు వెళ్లి.. సొంత డబ్బులతో భోజనం సీఎం

Tags:    

Similar News