నేను రూ.3 లక్షలు ఖర్చు పెట్టా.. ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల పెరుగుదలతో పాటు మరణాల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది. దీంతో కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, ముఖ్యమత్రి కేసీఆర్ తీరుపై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్నా.. ఆరోగ్యశాఖకు కేసీఆర్ ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు. కరోనా […]
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల పెరుగుదలతో పాటు మరణాల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది. దీంతో కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, ముఖ్యమత్రి కేసీఆర్ తీరుపై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్నా.. ఆరోగ్యశాఖకు కేసీఆర్ ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు. కరోనా సోకిన సమయంలో చికిత్స నిమిత్తం తానే దాదాపు రూ. 3 లక్షల వరకూ ఖర్చు పెట్టానని, అంత మొత్తాన్ని సామాన్యులు ఎలా భరిస్తారని ఫైర్ అయ్యారు.