ప్రభుత్వం కరోనా టెస్టులు తక్కువగా చేస్తోంది

– సీఎం వైఖరిలో కనిపించని శాస్త్రీయత: ఉత్తమ్ – గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు దిశ, న్యూస్‌ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) టెస్టులు తగ్గించడానికి గల కారణమేమిటని టీపీసీసీ(తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలనే టెస్టులు తక్కువగా చేస్తోందని ఆయన ఆరోపించారు. చనిపోయిన వారికి కరోనా టెస్టులు చేయొద్దని ఆదేశాలు ఇవ్వడం దేనికి సంకేతమని విమర్శించారు. సోమవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళి‌సై సౌందరరాజన్ కలిసిన […]

Update: 2020-05-04 08:49 GMT

– సీఎం వైఖరిలో కనిపించని శాస్త్రీయత: ఉత్తమ్
– గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

దిశ, న్యూస్‌ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) టెస్టులు తగ్గించడానికి గల కారణమేమిటని టీపీసీసీ(తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలనే టెస్టులు తక్కువగా చేస్తోందని ఆయన ఆరోపించారు. చనిపోయిన వారికి కరోనా టెస్టులు చేయొద్దని ఆదేశాలు ఇవ్వడం దేనికి సంకేతమని విమర్శించారు. సోమవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళి‌సై సౌందరరాజన్ కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆమెకు వివరించారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ,దేశ ప్రధాని మోడీ సైతం విపక్షాలతో ప్రస్తుత పరిస్థితుల‌పై విచారణ చేస్తున్నారని కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం విపక్షాలతో మాట్లాడడానికి సుముఖత చూపడం లేదని అన్నారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు ఎందుకు తక్కువగా చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టెస్టులు చేయకుండా కేసులు తగ్గినవని చూపడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కంటే చిన్న రాష్ట్రాలు కరోనా వైరస్ నియంత్రణ చర్యలో ముందంజలో ఉన్నాయని తెలిపారు. కరోనా బారిన పడి చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినట్లు చెప్పుకుంటున్నారని ఆరోపించారు.

లాక్‌డౌన్‌లో కేసీఆర్ సాయం కిలో బియ్యం మాత్రమే ఇస్తున్నారనీ, పంపిణీ చేసే బియ్యం కూడా దారుణంగా ఉన్నాయన్నారు. 10 లక్షల మంది ఉజ్వల, కోటి మంది దీపం లబ్ధిదారలకు ఉచితంగా గ్యాస్ అందించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. వలస కార్మికుల సంఖ్యపై ప్రభుత్వానికి క్లారిటీ లేదని అన్నారు. మార్చి 15 తర్వాత వచ్చిన వారికే బియ్యం, నగదు ఇస్తున్నారన్నారు. ప్రభుత్వ సాయం అందకపోవడం వల్ల వారంతా స్వస్థలాలకు వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిసుందన్నారు. మార్కెట్లలో ఉన్న గన్నీ బ్యాగులను గవర్నర్‌కు చూపించారు. బత్తాయి, నిమ్మ, పసుపు, మిర్చి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇటీవల బాండ్లకు వచ్చిన రూ.4వేల కోట్ల‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Tags: Congress,Telangana,CM, Modi,Opposition,Uttam,Governor,Coronavirus, Lockdown

Tags:    

Similar News