వందల కోట్లు మింగేశారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో వరద సాయంపై గవర్నర్ తమిళ సై కి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఫోన్ లో గవర్నర్‌తో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కోవిడ్ నేపథ్యంలో అపాయింట్ మెంట్ ఇవ్వలేమని గవర్నర్ తెలిపారు. హైదరాబాద్ వరదల్లో వందల మంది చనిపోయారని ఆయన తెలిపారు. కేసీఆర్ బయటకు రాలేదనీ, ఒక్కరిని కూడా పరామర్శించలేదని తెలిపారు. ఇంట్లోకి నీళ్లు వచ్చిన వారికి రూ. 50వేలు ఇవ్వడం సముచితమని అన్నారు. ఇళ్లు […]

Update: 2020-11-06 06:41 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో వరద సాయంపై గవర్నర్ తమిళ సై కి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఫోన్ లో గవర్నర్‌తో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కోవిడ్ నేపథ్యంలో అపాయింట్ మెంట్ ఇవ్వలేమని గవర్నర్ తెలిపారు. హైదరాబాద్ వరదల్లో వందల మంది చనిపోయారని ఆయన తెలిపారు. కేసీఆర్ బయటకు రాలేదనీ, ఒక్కరిని కూడా పరామర్శించలేదని తెలిపారు. ఇంట్లోకి నీళ్లు వచ్చిన వారికి రూ. 50వేలు ఇవ్వడం సముచితమని అన్నారు. ఇళ్లు కూలిన వారికి రూ. 5 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరి సొమ్మని టీఆర్ఎస్ నేతలు వరద సాయం పంచుతారని ఆయన ప్రశ్నించారు. వందల కోట్లు మింగేశారని ఆయన తెలిపారు.

Tags:    

Similar News