YSRను ఫాలో అవుతున్న రేవంత్ రెడ్డి..? అక్కడి నుంచే పాదయాత్ర షురూ!

దిశ, చేవెళ్ల : ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పెరిగిన నిత్యావసర ధరలను నిరసిస్తూ శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి మొదలై కుమ్మెర, మల్కాపూర్ మీదగా చేవెళ్ల మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు నివాళులర్పించారు. మరల అక్కడి నుంచి మండల కేంద్రంలో […]

Update: 2021-12-18 05:34 GMT

దిశ, చేవెళ్ల : ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పెరిగిన నిత్యావసర ధరలను నిరసిస్తూ శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆయన పాదయాత్ర ప్రారంభించారు.

అక్కడి నుంచి మొదలై కుమ్మెర, మల్కాపూర్ మీదగా చేవెళ్ల మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు నివాళులర్పించారు. మరల అక్కడి నుంచి మండల కేంద్రంలో గల షాబాద్ చౌరస్తాలో గల ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర ఈరోజు సాయంత్రం పెరిగిన నిత్యావసర ధరలను ఉద్దేశించి రోడ్ షోలో ప్రసంగిస్తారు. ఈ పాదయాత్రకు మాజీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాగా, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభించి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News