దేశం కోసం ప్రాణాలిచ్చిన ఏకైక పార్టీ మాది : రేవంత్ రెడ్డి

దిశ, చార్మినార్​ : భారతదేశం ఓ వసుదైక కుటుంబం అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్​గాంధీలు తమ చివరి రక్తపు బొట్టు వరకు దేశ సమగ్రత, సమైక్యత కోసం ప్రాణాలర్పించారని తెలిపారు. ఈ దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్​ పార్టీ నాయకులు ప్రాణాలు ధార పోస్తే , ఈ రోజు దేశభక్తులమని చెప్పుకునే కొన్ని రాజకీయ పార్టీ నాయకులు.. ఆనాడు చెమట కూడా చిందించలేదన్నారు. మంగళవారం చారిత్రాత్మక చార్మినార్ వద్ద రాజీవ్​గాంధీ సద్భావన […]

Update: 2021-10-19 07:23 GMT

దిశ, చార్మినార్​ : భారతదేశం ఓ వసుదైక కుటుంబం అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్​గాంధీలు తమ చివరి రక్తపు బొట్టు వరకు దేశ సమగ్రత, సమైక్యత కోసం ప్రాణాలర్పించారని తెలిపారు. ఈ దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్​ పార్టీ నాయకులు ప్రాణాలు ధార పోస్తే , ఈ రోజు దేశభక్తులమని చెప్పుకునే కొన్ని రాజకీయ పార్టీ నాయకులు.. ఆనాడు చెమట కూడా చిందించలేదన్నారు. మంగళవారం చారిత్రాత్మక చార్మినార్ వద్ద రాజీవ్​గాంధీ సద్భావన యాత్ర స్మారక సమితి అధ్యక్షుడు జి.నిరంజన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దివంగత నేత, మాజీ ప్రధాని రాజీవ్​గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సామాజిక, రాజకీయ, సాహిత్య రంగాలలో చేసిన సేవకు గుర్తింపుగా కర్నాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్​ఎమ్. వీరప్ప మొయిలీకి సద్భావనా యాత్ర అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్​ మాట్లాడుతూ.. కులాల, మతం, ప్రాంతాల పేరిట ఈ రాష్ట్రాన్ని విడగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్న వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశం వందకులాలు, మతాలు ప్రాంతాలతో కూడుకున్న ఓ వసుదైక కుటుంబం అన్నారు.

మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తే బడుగు, బలహీన, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళల యొక్క అభ్యున్నతికి పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి ఎన్ఎస్ బోస్​రాజ్,​మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంత్​రావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్​ఉత్తమ్​కుమార్​ రెడ్డి, ఎన్​డీఎంఏ వైస్​ చైర్మన్ మర్రిశశిధర్​ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి సి.దామోదర్,​ రాజనర్సింహా, మాజీ మంత్రులు కె.గీతారెడ్డి, మహ్మద్ ఆలీ షబ్బీర్, మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్, ఎంఏ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ బి కమలాకర్​రావు, సీనియర్​కాంగ్రెస్​ నాయకులు వంశీ చంద్​రెడ్డి, ఫేరోస్​ఖాన్​, ఎం.అనిల్​కుమార్​ యాదవ్​, శిఖా అబ్దుల్లా సోహైల్, శారద, బొజ్జ సంధ్యారెడ్డి, వెంకటేష్​ముదిరాజ్, చాకలి శైలేందర్, అల్లంభాస్కర్, సాయిరెడ్డి, జి.రాజరత్నం, సాయిరెడ్డి అశోక్​ రెడ్డి, జి.ఆనంద్, కన్నయ్యలాల్, యూసుఫ్​ హాష్మి, శ్యాంరావు ముదిరాజ్, రాజుయాదవ్, డి.నరసింగ్ రావు, ఎస్పీ క్రాంతికుమార్​ పాల్గొన్నారు.

Tags:    

Similar News