కేటీఆర్, హరీష్ రావు రాజకీయ చిట్టా విప్పిన రేవంత్..
దిశ, వెబ్‌డెస్క్ :టీపీసీసీ కాదు.. టీడీపీసీసీ అని మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఘాటు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారంతా టీడీపీ వాళ్లే కదా..? అని ప్రశ్నించారు. అంతేకాకుండా 2009లో కేటీఆర్‌కు రాజకీయ బిక్ష పెట్టింది టీడీపీ కాదా.. అలాగే హరీష్ రావుకు రాజకీయ బిక్ష పెట్టింది సోనియా, వైఎస్సార్ కాదా అని తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. తాను కాంగ్రెస్‌లో చేరే ముందు తన ఎమ్మెల్యే సభ్యత్వానికి […]
దిశ, వెబ్‌డెస్క్ :టీపీసీసీ కాదు.. టీడీపీసీసీ అని మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఘాటు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారంతా టీడీపీ వాళ్లే కదా..? అని ప్రశ్నించారు. అంతేకాకుండా 2009లో కేటీఆర్‌కు రాజకీయ బిక్ష పెట్టింది టీడీపీ కాదా.. అలాగే హరీష్ రావుకు రాజకీయ బిక్ష పెట్టింది సోనియా, వైఎస్సార్ కాదా అని తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. తాను కాంగ్రెస్‌లో చేరే ముందు తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశానని, గన్ మెన్లు, పర్సనల్ సెక్రెటరీలను కూడా వెనక్కి ఇచ్చేశానని రేవంత్ స్పష్టంచేశారు. హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండానే కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేయలేదా అని ప్రశ్నించారు.
‘కేటీఆర్ అసలు పేరు అజయ్’ అని కొత్త విషయం చెప్పారు. ప్రతిసారీ తాను టీడీపీ పార్టీ అని గుర్తు చేస్తున్నారని… నేను టీడీపీ అయితే కేసీఆర్ ఎంటనీ అడిగారు. కేసీఆర్ టీఆర్ఎస్‌కు ఎలా అధ్యక్షుడో తాను కాంగ్రెస్‌కు అధ్యక్షుడను అని వెల్లడించారు. తెలంగాణ మూవ్ మెంట్ సమయంలో కేసీఆర్ కుటుంబం అంతా ఢిల్లీ వెళ్లి సోనియా కాళ్లపై పడలేదా..? అని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. చివరగా 2022 ఆగస్టు 15 తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని.. అంతేకాకుండా కేటీఆర్‌ను తన తండ్రి ముఖ్యమంత్రిని చేయరని స్పష్టంచేశారు.