ఇవాళ ఎవరెవరు నామినేషన్లు వేశారంటే..!
దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడటంతో మొదటి రోజున అరడజను నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఇవన్నీ స్వతంత్ర అభ్యర్థులవే. ఇంకా ప్రధాన గుర్తింపు పొందిన రాష్ట్ర, జాతీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయలేదు. ఈ నెల 16వ తేదీ వరకు గడువు ఉన్నందున ఈ నెల 14వ తేదీ నుంచి ఒక్కొక్కరుగా నామినేషన్లను దాఖలు చేయనున్నట్లు ఆయా అభ్యర్థుల సన్నిహితులు తెలిపారు. శుక్రవారం నామినేషన్లు వేసినవారంతా ఒక్కో సెట్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడటంతో మొదటి రోజున అరడజను నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఇవన్నీ స్వతంత్ర అభ్యర్థులవే. ఇంకా ప్రధాన గుర్తింపు పొందిన రాష్ట్ర, జాతీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయలేదు. ఈ నెల 16వ తేదీ వరకు గడువు ఉన్నందున ఈ నెల 14వ తేదీ నుంచి ఒక్కొక్కరుగా నామినేషన్లను దాఖలు చేయనున్నట్లు ఆయా అభ్యర్థుల సన్నిహితులు తెలిపారు.
శుక్రవారం నామినేషన్లు వేసినవారంతా ఒక్కో సెట్ చొప్పున సమర్పించారు. నామినేషన్లు వేసినవారంతా పురుషులే. బుర్రా రవితేత, రేవు చిన్న ధనరాజు, సిలివేరు శ్రీకాంత్, మోతె నరేష్, మీసాల రాజాసాగర్, కోట శ్యామ్ కుమార్ తదితరులు నామినేషన్ పత్రాలను సమర్పించారు.