లాక్డౌన్ లో .. ఈ యాప్ లదే హవా!

దిశ, వెబ్ డెస్క్ : లాక్డౌన్ వల్ల రోజువారీ జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఉద్యోగస్తులు చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. విద్యార్థులు ఆన్ లైన్ కోర్సులు నేర్చుకుంటున్నారు. ఖాళీ సమయం ఉన్నోళ్లు మొబైల్ గేమ్స్ తో టైమ్ పాస్ చేస్తున్నారు. ఆయా పనులు, గేమ్స్ కోసం మార్చి 25 నుంచి ఏప్రిల్ 15 వరకు ఎక్కువమంది ఓ ఐదు యాప్స్ ను తెగ డౌన్ లోడ్ చేశారు. టిక్ టాక్ : చాలామంది […]

Update: 2020-05-05 04:04 GMT

దిశ, వెబ్ డెస్క్ :
లాక్డౌన్ వల్ల రోజువారీ జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఉద్యోగస్తులు చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. విద్యార్థులు ఆన్ లైన్ కోర్సులు నేర్చుకుంటున్నారు. ఖాళీ సమయం ఉన్నోళ్లు మొబైల్ గేమ్స్ తో టైమ్ పాస్ చేస్తున్నారు. ఆయా పనులు, గేమ్స్ కోసం మార్చి 25 నుంచి ఏప్రిల్ 15 వరకు ఎక్కువమంది ఓ ఐదు యాప్స్ ను తెగ డౌన్ లోడ్ చేశారు.

టిక్ టాక్ :

చాలామంది తమలోని ప్రతిభను ప్రపంచానికి చాటుకోవడానికి ‘టిక్ టాక్ ’యాప్ ను ఉపయోగిస్తున్నారు. లాక్డౌన్ టైమ్ లో ఈ యాప్ వినియోగం మరింత పెరిగింది. మార్చి నెలలో ప్రపంచలోనే అత్యధిక డౌన్ లోడ్ లు పొందిన యాప్ గా రికార్డు సృష్టించింది. మన దేశంలో మోస్ట్ పాపులర్ యాప్ గా ‘టిక్ టాక్’ నిలిచింది. లాక్డౌన్ టైమ్ లో 14.1 మిలియన్ యూజర్స్ ఈయాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. లాక్డౌన్ కు ముందు టిక్ టాక్ 18.9 మిలియన్ డౌన్ లోడ్ లు సాధించింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డౌన్ లోడ్ లు పొందిన యాప్ గా వాట్సాప్ టాప్ ప్లేస్ లో నిలిస్తే.. ఆ తర్వాతి స్థానంలో టిక్ టాక్ నిలిచింది.

జూమ్ :

లాక్డౌన్ టైమ్ లో అత్యధికంగా డౌన్ లోడ్ లు పొందిన యాప్ గా ‘జూమ్ ’ రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్ వీడియో కాల్స్ కు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. లాక్డౌన్ కు ముందు జూమ్ యాప్ కు 1,25,000 యూజర్లు మాత్రమే ఉన్నారు. ఈ యాప్ కేవలం రెండు వారాల్లోనే (మార్చి 11 నుంచి 25 వరకు) 3.6 మిలియన్ల యూజర్లు దక్కించుకుంది. ఆ తర్వాత మరో రెండు వారాల్లో 14 మిలియన్ల యూజర్లు జూమ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. కొన్ని ప్రైవసీ కారణాల వల్ల జూమ్ యాప్ ను వాడొద్దంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో .. యాప్ ను ఎవరూ డౌన్ లోడ్ చేయడం లేదు.

ఆరోగ్య సేతు :

ఏప్రిల్ 2న కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ ను ప్రారంభించింది. ఏప్రిల్ 22 వరకు దీన్ని 50 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఫోన్‌లోని బ్లూటూత్‌, లొకేషన్ ఆధారంగా కోవిడ్-19 పాజిటివ్ వ్యక్తులను మనం కలిసిందీ లేనిదీ ట్రాక్ చేసి చెబుతుంది. అలాగే, వైరస్‌పై అవగాహన కల్పించడంతో పాటు సలహాలు, సూచనలు అందిస్తుంది.

లూడో కింగ్ :

కరోనా టైమ్ లో చాలా పరిశ్రమలు నష్టపోయాయి. ఎన్నో యాప్స్ కూడా నష్టాలు చవిచూస్తున్నాయి. రానీ ఆన్‌లైన్‌ గేమింగ్‌ మాత్రం దూసుకుపోతుంది. 80శాతం ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడటానికే అందరూ మక్కువ చూపుతున్నారు. అయితే వీటిలో లూడో గేమ్‌ విశేష ఆదరణ పొందుతోంది. లాక్‌డౌన్‌ కాలంలో లూడో డౌన్‌లోడ్‌ చేసుకున్న వారి సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. లూడో గేమ్ ను లాక్డౌన్ టైమ్ లో 9.5 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకోగా 50 మిలియన్ల మంది డైలీ యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు.

యూవీడియో :

వాట్సాప్ వీడియో స్టేటస్ ల కోసం రూపొందించిన యాప్ ‘యూవీడియో’. హై క్వాలిటీ వీడియోలను ఇది అందిస్తుంది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 10 వరకు ఈ యాప్ ను 8.6 మిలియన్ల మంది దీన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈ యాప్ కు 50 మిలియన్ల యూజర్లు ఉన్నారు.

Tags: coronavirus, lockdown, covid 19, tiktok, zoom, arogya setu, uvideo, ludo king

Tags:    

Similar News