రాత్రి 10 తర్వాత హైదరాబాద్ ఫ్లైఓవర్స్ మూసివేత

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని అన్ని ఫ్లైఓవర్లను రాత్రి 10 గంటల తర్వాత మూసివేయనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ‘షాబ్-ఎ-మెరాజ్’ (మేల్కొని ఉండే రాత్రి) సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు, రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ఫ్లైఓవర్‌లు ఇవాళ(గురువారం) రాత్రి 10 గంటల నుంచి మూసివేయనున్నారు. తిరిగి శుక్రవారం యథావిధిగా ఫ్లై ఓవర్లు తెరచుకుంటాయని సమాచారం. కాగా, గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లైఓవర్, పివీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, లంగర్ హౌస్ […]

Update: 2021-03-11 08:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని అన్ని ఫ్లైఓవర్లను రాత్రి 10 గంటల తర్వాత మూసివేయనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ‘షాబ్-ఎ-మెరాజ్’ (మేల్కొని ఉండే రాత్రి) సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు, రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ఫ్లైఓవర్‌లు ఇవాళ(గురువారం) రాత్రి 10 గంటల నుంచి మూసివేయనున్నారు.

తిరిగి శుక్రవారం యథావిధిగా ఫ్లై ఓవర్లు తెరచుకుంటాయని సమాచారం. కాగా, గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లైఓవర్, పివీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, లంగర్ హౌస్ ఫ్లైఓవర్ మాత్రం తెరిచి ఉంటాయని సీపీ వెల్లడించారు. మొహమ్మద్ ప్రవక్త స్వర్గాన్ని అధిరోహించిన రాత్రిని ‘షాబ్-ఎ-మెరాజ్’ గా ముస్లిములు ఆచరిస్తారు.

Tags:    

Similar News