శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా టామ్ మూడీ
దిశ, స్పోర్ట్స్: శ్రీలంక క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా టామ్ మూడీ నియమించబడ్డారు. మూడీ ఈ పోస్టులో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. టామ్ మూడీ సేవలకు గాను ఏడాదికి 2 లక్షల డాలర్లు చెల్లించనున్నది. మూడేళ్లలో ఆయన కనీసం 300 రోజులు తప్పకుండా శ్రీలంక క్రికెట్ కోసం పని చేయాల్సి ఉంటుంది. అరవింద డిసిల్వ నేతృత్వంలో సమావేశం అయిన క్రికెట్ కమిటి టామ్ మూడీ నియామకానికి ఆమోదముద్ర వేసింది. టామ్ మూడీ ప్రస్తుతం సన్ రైజర్స్ […]
దిశ, స్పోర్ట్స్: శ్రీలంక క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా టామ్ మూడీ నియమించబడ్డారు. మూడీ ఈ పోస్టులో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. టామ్ మూడీ సేవలకు గాను ఏడాదికి 2 లక్షల డాలర్లు చెల్లించనున్నది. మూడేళ్లలో ఆయన కనీసం 300 రోజులు తప్పకుండా శ్రీలంక క్రికెట్ కోసం పని చేయాల్సి ఉంటుంది. అరవింద డిసిల్వ నేతృత్వంలో సమావేశం అయిన క్రికెట్ కమిటి టామ్ మూడీ నియామకానికి ఆమోదముద్ర వేసింది. టామ్ మూడీ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి డైరెక్ట్ ఆఫ్ క్రికెట్‌గా పని చేస్తున్నారు.. ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు సభ్యడైన టామ్ మూడీ.. ఆల్‌రౌండర్‌గా మంచి రికార్డు ఉన్నది. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా 180 రోజులు కొలంబోలో ఉండాలని మొదట శ్రీలంక బోర్డు ప్రతిపాదించింది. అయితే ఏడాదికి 110 రోజులు మాత్రమే తాను అందుబాటులో ఉంటానని మూడీ చెప్పడంతో ఆ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు.