కొవిడ్ 19 వాక్సిన్ కోసం టామ్ హ్యాంక్స్ రక్తదానం

దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్‌లో పెద్ద హీరో టామ్ హ్యాంక్స్‌కి, ఆయన భార్య రీటా విల్సన్‌కి కరోనా సోకి, దాని బారి నుంచి బయటపడిన సంగతి కూడా తెలిసిందే. అయితే కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్న వారి రక్తం నమూనాలు కావాల్సి ఉంది. అందుకు తన రక్త నమూనాలను అందించనున్నట్లు టామ్ హ్యాంక్స్ ప్రకటించారు. ఎన్‌పీఆర్ పోడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ తమ తక్షణ కర్తవ్యం ఏంటని అందరూ అడుగుతున్నారని, తాము చేయగలిగింది ఏమున్నా […]

Update: 2020-04-26 02:13 GMT

దిశ, వెబ్‌డెస్క్:
హాలీవుడ్‌లో పెద్ద హీరో టామ్ హ్యాంక్స్‌కి, ఆయన భార్య రీటా విల్సన్‌కి కరోనా సోకి, దాని బారి నుంచి బయటపడిన సంగతి కూడా తెలిసిందే. అయితే కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్న వారి రక్తం నమూనాలు కావాల్సి ఉంది. అందుకు తన రక్త నమూనాలను అందించనున్నట్లు టామ్ హ్యాంక్స్ ప్రకటించారు.

ఎన్‌పీఆర్ పోడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ తమ తక్షణ కర్తవ్యం ఏంటని అందరూ అడుగుతున్నారని, తాము చేయగలిగింది ఏమున్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని టామ్ హ్యాంక్స్ అన్నారు. కావాలంటే తన ప్లాస్మా, తన రక్తాన్ని కూడా ఇస్తానని చెప్పాడు. అయితే వ్యాక్సిన్ తయారీకి తన రక్తం వాడితే మాత్రం దానికి హ్యాంక్-సీన్ అని పేరు పెట్టాలని ఆయన జోక్ కూడా చేశారు. ఈ కొవిడ్ 19 కారణంగా తాను తన భార్య చాలా ఇబ్బంది పడ్డట్లు టామ్ గతంలో వెల్లడించారు.

Tags: Hollywood, Tom Hanks, Corona, Covid, Rita Wilson, Blood

Tags:    

Similar News