నేటి నుంచి తిరుపతిలో కఠిన ఆంక్షలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో నేటి నుంచి తిరుపతిలో కఠిన ఆంక్షలు అమలు కానున్నాయి. ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులు, కూరగాయల దుకాణాలు మధ్యాహ్నం 1 వరకు తెరచి ఉంచేవారు. నేటి నుంచి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కేవలం కూరగాయల మార్కెట్లకు మాత్రమే అనుమతిచ్చారు. కరోనా నేపథ్యంలోనిత్యావసర వస్తువులు కావాల్సిన వారికి హోం డెలివరీ చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ముందుకు రావడంతో పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. వేకువ జాము […]
కరోనా వ్యాప్తి నేపథ్యంలో నేటి నుంచి తిరుపతిలో కఠిన ఆంక్షలు అమలు కానున్నాయి. ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులు, కూరగాయల దుకాణాలు మధ్యాహ్నం 1 వరకు తెరచి ఉంచేవారు. నేటి నుంచి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కేవలం కూరగాయల మార్కెట్లకు మాత్రమే అనుమతిచ్చారు. కరోనా నేపథ్యంలోనిత్యావసర వస్తువులు కావాల్సిన వారికి హోం డెలివరీ చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ముందుకు రావడంతో పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. వేకువ జాము 4 నుండి 8 గంటల వరకే తిరుపతిలో పాల సరఫరా ఉంటుందని పోలీసులు తెలిపారు.అలాగే ఉదయం 5 నుంచి 9 వరకు నగదు తీసుకునే ఏటీఎం సెంటర్లు, పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లతో పాటు వాటిని నింపుకునేందుకు వాహనాలకు కూడా అనుమతి ఇచ్చారు.
Tags: tirupathi, shopes close, police