లింక్ చేశారా.. ఈరోజుతో గడువు పూర్తి

దిశ, వెబ్‌డెస్క్: ఆధార్ కార్డుతో పాన్‌కార్డు అనుసంధానికి గడువు నేటితో ముగియనుంది. ఇంకా లింక్ చేసుకోని వాళ్లు మిగిలి ఉంటే వెంటనే చేసుకోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కనుక మార్చి 31లోపు మీ ఆధార్ కార్డుకు పాన్ లింక్ చేసుకోవాలి. ఒక వేళ లింక్ చేయకపోతే మీ బ్యాంకు లావాదేవీలలో ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాకుండా.. రూ.1,000 వరకు […]

Update: 2021-03-30 20:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆధార్ కార్డుతో పాన్‌కార్డు అనుసంధానికి గడువు నేటితో ముగియనుంది. ఇంకా లింక్ చేసుకోని వాళ్లు మిగిలి ఉంటే వెంటనే చేసుకోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కనుక మార్చి 31లోపు మీ ఆధార్ కార్డుకు పాన్ లింక్ చేసుకోవాలి. ఒక వేళ లింక్ చేయకపోతే మీ బ్యాంకు లావాదేవీలలో ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాకుండా.. రూ.1,000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) గతేడాది ఫిబ్రవరి 13న నోటిఫికేషన్‌ జారీ చేసింది. మార్చి 31, 2021లో పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించింది. ఈ లోపు ఈ రెండింటిని అనుసంధానించకపోయినట్లయితే ఏప్రిల్‌ 1, 2021 నుంచి ఆ పాన్‌ కార్డు ఉన్న వ్యక్తికి వెయ్యి రూపాయాల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

Tags:    

Similar News