కామారెడ్డిలో 6 కరోనా కేసులు
దిశ, నిజామాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ ఇప్పట్లో తగ్గేలా లేదు. అందుకు కారణం రోజువారీగా వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం అని తెలుస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు అదుపులోనే ఉన్న కరోనా సడలింపుల అనంతరం జెట్‌స్పీడ్‌లో దూసుకుపోతున్నది. తాజాగా కామారెడ్డిలో 6 కరోనా పాజిటివ్ కేసుల నమోదైనట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్ మంగళవారం ప్రకటించారు. 3 రోజుల కిందట 24 మంది శాంపిళ్లను సేకరించి పంపగా ఇందులో 18 నెగిటివ్ , 6 పాజిటివ్ […]
దిశ, నిజామాబాద్:
తెలంగాణలో కరోనా విజృంభణ ఇప్పట్లో తగ్గేలా లేదు. అందుకు కారణం రోజువారీగా వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం అని తెలుస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు అదుపులోనే ఉన్న కరోనా సడలింపుల అనంతరం జెట్‌స్పీడ్‌లో దూసుకుపోతున్నది. తాజాగా కామారెడ్డిలో 6 కరోనా పాజిటివ్ కేసుల నమోదైనట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్ మంగళవారం ప్రకటించారు. 3 రోజుల కిందట 24 మంది శాంపిళ్లను సేకరించి పంపగా ఇందులో 18 నెగిటివ్ , 6 పాజిటివ్ గా వచ్చాయని వివరించారు. జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్‌లో 1, వాసవి నగర్ కాలనీలో 1, అజంపురా కాలనీలో 1 ,సదాశివనగర్ మండలంలో 2 , బిబీపేట్ మండలం జనగామలో 1 పాజిటివ్ కేసు నమోదు అయ్యాయన్నారు. వీరిలో ఇటీవల ముగ్గురు వ్యక్తులకు పాజిటివ్ రావడంతో.. వారిని కలిసిన వ్యక్తులు 111మంది ప్రైమరీ కాంటాక్టులకు సంబంధించిన వారని తెలిపారు. వీరందరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి, వారితో ప్రైమరి కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్‌లో ఉన్నవారిని గుర్తించే పనిలో ఆరోగ్య శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.