రంగారెడ్డిలో 29 కరోనా పాజిటివ్ కేసులు

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో నేటికి 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ ఆమోయ్ కుమార్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. మార్చి 1నుంచి ఈ రోజు వరకు విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య 4,654కు చేరిందన్నారు. అదే విధంగా డొమెస్టిక్ ట్రావెల్ హిస్టరీ ఉన్నవారి సంఖ్య 224గా నిర్దారించినట్టు వివరించారు. ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య అధికారిక లెక్కల ప్రకారం 108 మంది అని చెప్పారు. విదేశాల నుంచి […]

Update: 2020-04-07 09:01 GMT

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో నేటికి 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ ఆమోయ్ కుమార్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. మార్చి 1నుంచి ఈ రోజు వరకు విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య 4,654కు చేరిందన్నారు. అదే విధంగా డొమెస్టిక్ ట్రావెల్ హిస్టరీ ఉన్నవారి సంఖ్య 224గా నిర్దారించినట్టు వివరించారు. ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య అధికారిక లెక్కల ప్రకారం 108 మంది అని చెప్పారు. విదేశాల నుంచి వచ్చి 14 రోజుల హోమ్ క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారి సంఖ్య నేటికి 4,654గా వెల్లడించారు. డొమెస్టిక్ ట్రావెల్ చేసిన వారిలో 14 రోజుల హోమ్ క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారి సంఖ్య 224 మంది అని అన్నారు. ప్రభుత్వ హెల్ప్‌లైన్స్ నెంబర్స్ ద్వారా కరోనా అనుమానితులు 17 మందిని గుర్తించామన్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 6 ఐసోలేషన్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఐసోలేషన్ సెంటర్స్ ద్వారా ఇప్పటి వరకు 406 మందికి ప్రభుత్వం చికిత్స అందిస్తున్నట్టు స్పష్టం చేశారు. వీరిలో కొందరికి మర్కజ్ ట్రావెల్ హిస్టరీ ఉందన్నారు. సెకండరీ కంటాక్ట్ ద్వారా హోమ్ ఐసోలేషన్‌లో 77 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటింటా సర్వే చేసిన వారి సంఖ్య 18,622 మంది తేల్చారు. అధికారుల సర్వే, సర్వేలైన్స్ ద్వారా ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 83,289 మందిని విచారించినట్టు తెలిపారు.

Tags: corona 29 positive cases, ranga reddy, collector amoy kumar

Tags:    

Similar News