రాష్ట్రంలో మూడు వేల మార్క్.. కొత్తగా 129 కరోనా కేసులు
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మూడు వేల మార్కును దాటింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటెన్ ప్రకారం ఒక్క రోజులోనే 129 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలో 108 పాజిటివ్ కేసులు తేలగా, రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో 6 చొప్పున, మేడ్చల్, సిరిసిల్లాల్లో 2, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వలస కూలీల్లో ఇద్దరి చొప్పున కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల […]
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మూడు వేల మార్కును దాటింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటెన్ ప్రకారం ఒక్క రోజులోనే 129 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలో 108 పాజిటివ్ కేసులు తేలగా, రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో 6 చొప్పున, మేడ్చల్, సిరిసిల్లాల్లో 2, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వలస కూలీల్లో ఇద్దరి చొప్పున కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,020కి చేరుకున్నాయి. ఈ వైరస్ బారిన పడి మంగళవారం ఏడుగురు మృతి చెందడంతో కరోనా మరణాలు మొత్తంగా 99కి చేరుకున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 1,365 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. 1,556 మంది డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లారు. తెలంగాణలో ప్లాస్మా థెరపీని అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఐదుగురికి చికిత్స అందిస్తుండగా..ఒకరు కోలుకుని డిశ్చార్జి అయ్యారని హెల్త్ బులిటెన్ పేర్కొంది.
గ్రేటర్‌లో కరోనా భయం..
గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు తగ్గడం లేదు. వారం రోజులుగా సగటున దాదాపు నిత్యం వంద కేసులు నమోదవుతుండటంతో నగర వాసులు భయాందోళన చెందుతున్నారు. ఉస్మానియా ఆస్పత్రి, నిమ్స్‌లోని వైద్యులతో పాటు మీడియాలోని వ్యక్తుల్లోనూ కరోనా బయటపడింది. అటు పోలీసు శాఖలో పనిచేస్తున్నవారు సైతం కరోనా సోకి చికిత్స పొందుతుండగా.. బుధవారం జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న 10మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు సమాచారం. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ఏరియాలోని కార్మికులకు పాజిటివ్ రావడంతో మిగిలిన వారితో ఎలా పనిచేయించుకోవాలన్నది జీహెచ్ఎంసీకి సవాల్‌గా మారుతోంది. కరోనా వారియర్స్‌గా ముందు వరుసలో ఉన్న సిబ్బంది అందరూ ఒక్కొక్కరుగా మహమ్మారి బారిన పడుతుండటంతో సామాన్య ప్రజల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.