సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
దిశ, మహబూబ్ నగర్: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రి కేటిఆర్ పిలుపు మేరకు ఆయన మహబూబ్ నగర్ పట్టణంలోని ఏనుగొండలో వర్షపునీరు నిల్వ ఉన్న ప్రాంతాలు పరిశీలించి పూలతొట్టిలోని నీటిని తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దోమల ద్వారా సంక్రమించే అన్ని రకాల సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలను జిల్లాలో నిర్వహిస్తూన్నామన్నారు. ఈకార్యక్రమంలో ప్రతి […]
దిశ, మహబూబ్ నగర్: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రి కేటిఆర్ పిలుపు మేరకు ఆయన మహబూబ్ నగర్ పట్టణంలోని ఏనుగొండలో వర్షపునీరు నిల్వ ఉన్న ప్రాంతాలు పరిశీలించి పూలతొట్టిలోని నీటిని తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దోమల ద్వారా సంక్రమించే అన్ని రకాల సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలను జిల్లాలో నిర్వహిస్తూన్నామన్నారు. ఈకార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. డెంగ్యూ వ్యాధి నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం మహబూబ్ నగర్ పట్టణంలోని ఏనుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన ఆదనపు తరగతుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే శివశక్తి నగర్ లో కరోనా వైరస్ విస్తరించకుండా నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్ వెంకట్రావు తో కలసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, జిల్లా అధికారులు ఉన్నారు.