సాగర్ పాలి‘ట్రిక్స్’.. పీఆర్సీ పేరుతో గులాబీ లాబీయింగ్

దిశ, తెలంగాణ బ్యూరో : నాగార్జునసాగర్ ఉపఎన్నిక సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం సాగర్‌లోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ విజయ్ విహార్లో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మరీ టిఎన్జీవోల అసోసియేషన్ నాయకులు పీఆర్సీ సభ ఏర్పాటు చేశారు. ఉద్యోగులందరూ టీఆర్ఎస్‌కు ఓట్లు వేసేలా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టిఎన్జీవో నాయకుల ప్రలోభాలకు లోనయిన ఉద్యోగులతో ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్ […]

Update: 2021-04-07 08:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నాగార్జునసాగర్ ఉపఎన్నిక సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం సాగర్‌లోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ విజయ్ విహార్లో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మరీ టిఎన్జీవోల అసోసియేషన్ నాయకులు పీఆర్సీ సభ ఏర్పాటు చేశారు. ఉద్యోగులందరూ టీఆర్ఎస్‌కు ఓట్లు వేసేలా ప్రలోభాలకు గురిచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టిఎన్జీవో నాయకుల ప్రలోభాలకు లోనయిన ఉద్యోగులతో ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్ ఎలా జరుపుతారని, అసలు ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా టీఎన్జీవోస్ మీటింగ్‌కు ఎట్లా అనుమతి ఇచ్చారని కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ సజ్జన్ సింగ్‌కు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజుతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎరవాతి అనిల్ కుమార్, టీపీసీసీ సెక్రెటరీ రోహిన్ రెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు. టీజేఏసీ ఏర్పాటుకు తోడ్పడి, తెలంగాణ రావడానికి పాటుపడిన జానారెడ్డిని ఓడించేందుకు కేసీఆర్ ఇంత చిల్లర రాజకీయాలు చేయడం తగదని వారు మండిపడ్డారు.

Tags:    

Similar News