ఎమ్మెల్యే జగ్గారెడ్డిని హెచ్చరించిన టీజీవో నేతలు

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం హెచ్చరించింది. ఈ మేరకు టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ప్రతినిధులు రవీందర్ కుమార్, సామల సహదేవ్ తదితరులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్‌కు గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా, ఎంప్లాయిస్ జేఏసీ సెక్రటరీ జనరల్‌గా మిఠాయిలు తినిపిస్తే తప్పేముందని వారు జగ్గారెడ్డిని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన […]

Update: 2020-07-18 07:47 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం హెచ్చరించింది. ఈ మేరకు టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ప్రతినిధులు రవీందర్ కుమార్, సామల సహదేవ్ తదితరులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్‌కు గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా, ఎంప్లాయిస్ జేఏసీ సెక్రటరీ జనరల్‌గా మిఠాయిలు తినిపిస్తే తప్పేముందని వారు జగ్గారెడ్డిని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవీలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించబోమన్నారు. ఉద్యోగుల హక్కులపై సీఎం‌ను కలవడం ఎప్పుడూ జరిగేదేనని, ఉద్యోగుల సమస్యల పట్ల తాము ప్రభుత్వ పెద్దలను కలుస్తూనే ఉంటామని వారు స్పష్టం చేశారు. దీనిపై జగ్గారెడ్డికి ఉన్న అభ్యంరతం ఏమిటో తమకు అర్థం కావడం లేదన్నారు.

Tags:    

Similar News