పేరు మార్పుపై టీఎన్జీవో హర్షం

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నీటిపారుదల శాఖను జల వనరుల శాఖగా పేరు మార్చడంపై టీఎన్జీవో సంతోషం వ్యక్తం చేసింది. ఈమేరకు గురువారం నాంపల్లిలోని కార్యాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నీటిపారుదల ఆఫీసర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్జీవో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. జలవనరుల శాఖలో పోస్ట్‌లు పెంచడంతో పాటు బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నీటిపారుదలశాఖ జలవనరుల శాఖగా […]

Update: 2020-08-20 06:53 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నీటిపారుదల శాఖను జల వనరుల శాఖగా పేరు మార్చడంపై టీఎన్జీవో సంతోషం వ్యక్తం చేసింది. ఈమేరకు గురువారం నాంపల్లిలోని కార్యాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నీటిపారుదల ఆఫీసర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్జీవో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. జలవనరుల శాఖలో పోస్ట్‌లు పెంచడంతో పాటు బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

నీటిపారుదలశాఖ జలవనరుల శాఖగా మార్చడంతో కొత్తగా చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయాల ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, రాష్ట్ర కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, నీటిపారుదల శాఖ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News