గవర్నర్‌ను తొలగించాలని రాష్ట్రపతికి లేఖ..
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను తొలగించాలని ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్‌కు లేఖ రాశారు. రాజ్యాంగ విలువలను కాపాడటంలో గవర్నర్ విఫలమయ్యారని, సుప్రీంకోర్టు ఆదేశాలను పలుసార్లు ఉల్లంఘించారని ఎంపీలు సుఖేందు శేఖర్ రే, సుదీప్ బందోపాద్యాయ్, డెరెక్ ఓబ్రియన్, కళ్యాణ్ బెనర్జీ, కకోలి ఘోష్ దస్తిదర్‌లు ఆ లేఖలో ఆరోపించారు. కేంద్రంలోని పార్టీ ప్రత్యర్థి అయినందున రాష్ట్రంలో అధికారంలోని తృణమూల్ కాంగ్రెస్‌పై బురదజల్లడానికి గవర్నర్ ప్రయత్నిస్తున్నారని, విభజన రాజకీయాలు […]
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను తొలగించాలని ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్‌కు లేఖ రాశారు. రాజ్యాంగ విలువలను కాపాడటంలో గవర్నర్ విఫలమయ్యారని, సుప్రీంకోర్టు ఆదేశాలను పలుసార్లు ఉల్లంఘించారని ఎంపీలు సుఖేందు శేఖర్ రే, సుదీప్ బందోపాద్యాయ్, డెరెక్ ఓబ్రియన్, కళ్యాణ్ బెనర్జీ, కకోలి ఘోష్ దస్తిదర్‌లు ఆ లేఖలో ఆరోపించారు. కేంద్రంలోని పార్టీ ప్రత్యర్థి అయినందున రాష్ట్రంలో అధికారంలోని తృణమూల్ కాంగ్రెస్‌పై బురదజల్లడానికి గవర్నర్ ప్రయత్నిస్తున్నారని, విభజన రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు పలుతీర్పుల్లో పేర్కొన్న సమాఖ్య వ్యవస్థ విలువలను రాజ్యాంగబద్ధ హోదాలో ఉండి కూడా ఆయన ఎత్తిపట్టలేదని తెలిపారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తు్న్న తరుణంలో సీఎం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై తరుచూ ఆరోపణలు చేసే గవర్నర్ ధన్‌కర్ తొలిగింపు డిమాండ్ రావడం గమనార్హం.