బంగారు తెలంగాణ బందీ అయ్యింది !: కోదండరాం
దిశ, తుంగతుర్తి: కొట్లాడి సాధించుకున్న తెలంగాణ.. గదిలో బందీ అయ్యిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో వైఫల్యం చెందారని విమర్శించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కోదండరాం ఈ వ్యాఖ్యలు చేశారు. వానాకాలం పంట సమయంలో సన్నవండ్లను పండించాలని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు కొనడం లేదని, కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్ర అప్పుల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి […]
దిశ, తుంగతుర్తి: కొట్లాడి సాధించుకున్న తెలంగాణ.. గదిలో బందీ అయ్యిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో వైఫల్యం చెందారని విమర్శించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కోదండరాం ఈ వ్యాఖ్యలు చేశారు. వానాకాలం పంట సమయంలో సన్నవండ్లను పండించాలని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు కొనడం లేదని, కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్ర అప్పుల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అయినా నేటికి యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నరన్నారు. ప్రశ్నించే గొంతుకగా ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.