కరోనాపై శ్వేతపత్రం విడుదల చేయాలి
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా విలయతాండవం పై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో కరోనా రోగులకు అందుతున్న సేవలపై హైకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. ప్రభుత్వం సాధారణ బెడ్లు 4008, ఐసీయూ 600 బెడ్లను మాత్రమే ఏర్పాటు చేసిందని, ఇంకా ఎక్కువ బెడ్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా వైరస్ నివారణకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు వచ్చిన నిధుల వివరాలు, ఖర్చులు ప్రకటించాలన్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా విలయతాండవం పై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో కరోనా రోగులకు అందుతున్న సేవలపై హైకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. ప్రభుత్వం సాధారణ బెడ్లు 4008, ఐసీయూ 600 బెడ్లను మాత్రమే ఏర్పాటు చేసిందని, ఇంకా ఎక్కువ బెడ్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా వైరస్ నివారణకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు వచ్చిన నిధుల వివరాలు, ఖర్చులు ప్రకటించాలన్నారు. ఈ నెల 27న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని కోదండరాం వెల్లడించారు.