అమ్మాయిలను ఆవిష్కరణ కర్తలుగా తీర్చిదిద్దేందుకు ‘టీటా’ కృషి

దిశ, తెలంగాణ బ్యూరో: కళాశాల దశ నుంచి అమ్మాయిల్లోని నైపుణ్యాల‌ను వెలికి తీసి వారిని ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల తెలిపారు. టెక్నాల‌జీ ఇన్నోవేష‌న్ అండ్ ఇంక్యుబేష‌న్ సెంట‌ర్ (టీఐఐసీ ) ఏర్పాటుకు టీటా ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మారేడ్‌ప‌ల్లిలోని క‌స్తూర్బా గాంధీ డిగ్రీ , పీజీ కళాశాల వైస్ ప్రిన్సిప‌ల్ డాక్టర్ రాజ‌శ్రీ‌తో సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పంద పత్రాలు అందజేశారు. ఈ […]

Update: 2021-04-12 09:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కళాశాల దశ నుంచి అమ్మాయిల్లోని నైపుణ్యాల‌ను వెలికి తీసి వారిని ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల తెలిపారు. టెక్నాల‌జీ ఇన్నోవేష‌న్ అండ్ ఇంక్యుబేష‌న్ సెంట‌ర్ (టీఐఐసీ ) ఏర్పాటుకు టీటా ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మారేడ్‌ప‌ల్లిలోని క‌స్తూర్బా గాంధీ డిగ్రీ , పీజీ కళాశాల వైస్ ప్రిన్సిప‌ల్ డాక్టర్ రాజ‌శ్రీ‌తో సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పంద పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా సందీప్ కుమార్ మాట్లాడుతూ యువ‌త‌లోని నైపుణ్యాల‌ను వెలికితీసి వారిని ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దే క్రమంలో మ‌హిళ‌ల‌కు మ‌రింత ప్రోత్సాహం ద‌క్కాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. రాష్ర్టంలోనే మ‌హిళ‌ల కోసం ప్రత్యేక ఇంక్యుబేష‌న్ సెంట‌ర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పూలే స్ఫూర్తితో మ‌హిళా సాధికార‌తకు త‌మ వంతు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మ‌హిళ‌ల ఆవిష్కర‌ణ‌ల‌కు ఫ‌లితాల రూపంలో ఇవ్వడం, కంపెనీల ఏర్పాటు, ఆలోచ‌న‌ల వృద్ధికి టీటా కృషి చేస్తుందని తెలిపారు.

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వివిధ కాలేజీల్లో ఉమెన్ ఇంక్యుబేష‌న్ సెంట‌ర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టీటా హైద‌రాబాద్ జిల్లా కార్యదర్శి విజ‌య స్పంద‌న‌, స్టూడెంట్ స్టేట్ సెక్రట‌రీ మ‌హ్మద్ ఇలియాస్‌, క‌స్తూర్భా క‌ళాశాల అధ్యాప‌కులు దాస‌రి క‌విత‌, శివ ల‌క్ష్మి , షాజిదా, టీటా స్టూడెంట్ చాప్టర్ త‌ర‌ఫున రోష్నీ ఠాకూర్‌, పి.గాయ‌త్రి నిహారిక, ఎస్.భార్గవి, ఆర్‌. దివ్య , వి. ప్రవ‌ళిక‌, వై.ర‌వ‌ళి పాల్గొన్నారు.

Tags:    

Similar News