సీఎం జగన్‌తో తిరుపతి లోక్ సభ వైసీపీ అభ్యర్థి భేటీ

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తిరుపతి లోక్ సభ వైసీపీ అభ్యర్థి డా.ఎం.గురుమూర్తి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గురుమూర్తిని అభినందించారు. ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఇకపోతే ఇటీవలే తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మరణించారు. […]

Update: 2021-03-17 06:29 GMT
gurumurthy jagan
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తిరుపతి లోక్ సభ వైసీపీ అభ్యర్థి డా.ఎం.గురుమూర్తి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గురుమూర్తిని అభినందించారు. ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఇకపోతే ఇటీవలే తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు పోటీకి విముఖత చూపడంతో డా.ఎం.గురుమూర్తిని వైసీపీ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది.

Tags:    

Similar News