కష్టం ముందు ఏ కల పెద్దది కాదు.. ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ ని ఉద్దేశించి చంద్రబాబు

Update: 2025-04-29 07:12 GMT
కష్టం ముందు ఏ కల పెద్దది కాదు.. ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ ని ఉద్దేశించి చంద్రబాబు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: కష్టం ముందు ఏ కల పెద్దది కాదు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. కానిస్టేబుల్ (Constable) నుంచి ఐపీఎస్ (IPS)గా సెలెక్ట్ అయిన ఆంధ్ర వాసిని ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ధైర్యసాహసాలు, విశ్రాంతి లేని శ్రమ ముందు ఏ కల కూడా పెద్దది కాదని కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగిన ఉదయకృష్ణారెడ్డి (Udaya Krishna Reddy) ప్రయాణం రుజువు చేసిందని అన్నారు. దృఢ సంకల్పంతో అన్నీ అవరోధాలను ఛేదిస్తూ.. కొత్త తీరాలను చేరుకోవచ్చని అతని కథ మనకు గుర్తు చేస్తుందని తెలిపారు.

చివరగా కలను ఎప్పటికీ విడిచిపెట్టని వారిదే భవిష్యత్తు అని సీఎం రాసుకొచ్చారు. కాగా ప్రకాశం జిల్లా ఉల్లపాలెం కు చెందిన ఉదయకృష్ణా రెడ్డి సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 350 ర్యాంకు సాధించి ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యాడు. 2013 లో కానిస్టేబుల్ గా పోలీసు ఉద్యోగంలో చేరి, పై అధికారి పెడుతున్న అవమానాలు బరించలేక రాజీనామా చేసి, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. అనంతరం ఎన్ని అవమానాలు ఎదురైన నిష్క్రమించక తీవ్రంగా కృషి చేశాడు. దీంతో నాల్గవ ప్రయత్నంలో 780 ర్యాంకు సాధించి ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (IRMS) లో చేరారు. ఐపీఎస్ కావాలనే తన కలను ముందు పెట్టుకొని మళ్లీ ప్రయత్నించడంతో 2025 యూపీఎస్సీ ఫలితాల్లో (UPSC Results 2025) 350 ర్యాంకుతో తన కలను సాకారం చేసుకున్నాడు. 

Full View

Similar News