Tragedy: రాష్ట్రంలో తీవ్ర విషాదం.. ముగ్గురు కార్మికులు స్పాట్ డెడ్

ముగురు కార్మికులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లా (Tirupati District)లో చోటుచేసుకుంది.

Update: 2025-04-29 06:46 GMT
Tragedy: రాష్ట్రంలో తీవ్ర విషాదం.. ముగ్గురు కార్మికులు స్పాట్ డెడ్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ముగురు కార్మికులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లా (Tirupati District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగళం (Mangalam)లోని తుడా క్వార్టర్స్‌ (TUDA Quarter)లో హెచ్ఐజీ (HIG) భవనం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. అయితే, ఇవాళ మధాహ్నం బిల్డింగ్‌పై పని చేస్తున్న ముగ్గురు కార్మికులు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడిపోయారు. దీంతో తీవ్ర గాయలైన వారు స్పాట్‌‌లోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News