మీ ఫ్రెండ్‌కు సోషల్ యాంగ్జైటీ డిజార్డర్‌ ఉందా?

దిశ, ఫీచర్స్: మానసిక ఆరోగ్య పరిస్థితి, సోషల్ యాంగ్జైటీ డిజార్డర్(SAD) వంటివి సోషల్ ఇంటరాక్షన్స్ సమయంలో ఆందోళనకు దారితీయవచ్చు. ఈ పరిస్థితి గల వ్యక్తులు అపరిచితులతో మాట్లాడేటప్పుడే కాక బహిరంగంగా మాట్లాడటం, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, సంభాషణలు ప్రారంభించడం, పార్టీలకు వెళ్లడం తదితర విషయాల పట్ల అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. అలాంటి వ్యక్తులు తాము ఇతరులచే క్రిటిసైజ్ చేయబడతామని భయపడుతుంటారు. ఈ క్రమంలో వారు ఇబ్బంది పడటమే కాక ఇతరులను ఇబ్బందికి గురిచేస్తుంటారు. కాగా, సోషల్ యాంగ్జైటీ […]

Update: 2021-10-18 07:43 GMT

దిశ, ఫీచర్స్: మానసిక ఆరోగ్య పరిస్థితి, సోషల్ యాంగ్జైటీ డిజార్డర్(SAD) వంటివి సోషల్ ఇంటరాక్షన్స్ సమయంలో ఆందోళనకు దారితీయవచ్చు. ఈ పరిస్థితి గల వ్యక్తులు అపరిచితులతో మాట్లాడేటప్పుడే కాక బహిరంగంగా మాట్లాడటం, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, సంభాషణలు ప్రారంభించడం, పార్టీలకు వెళ్లడం తదితర విషయాల పట్ల అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. అలాంటి వ్యక్తులు తాము ఇతరులచే క్రిటిసైజ్ చేయబడతామని భయపడుతుంటారు. ఈ క్రమంలో వారు ఇబ్బంది పడటమే కాక ఇతరులను ఇబ్బందికి గురిచేస్తుంటారు. కాగా, సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ కలిగిన వ్యక్తులు మీకు తారసపడితే వారికి ఏవిధంగా మద్దతివ్వాలనే అంశంపై ప్రముఖ థెరపిస్ట్, కౌన్సిలర్ సిఫార్సు చేసిన కొన్ని చిట్కాలు..

– ఓపికతో తమకు ఏం అవసరమో వారినే అడగాలి. సమస్యను అర్థం చేసుకుని, నయమయ్యేవరకూ సమయం ఇవ్వాలి.
– ఆ వ్యక్తుల ప్రవర్తన మీకు ఎలా అనిపిస్తుందనే కన్నా వారి ఫీలింగ్స్‌పై దృష్టి పెట్టాలి. విమర్శలు లేదా నిందారోపణలు మానుకోవాలి.
– SAD గురించి మీకు మీరుగా తెలుసుకుని దాని లక్షణాలు, సాధ్యమయ్యే ప్రతిచర్యతోపాటు సర్దుబాటు పద్ధతులను అర్థం చేసుకోవాలి.
– మానసిక ఆరోగ్య నిపుణుల ద్వారా చికిత్స(CBT వంటివి) తీసుకోవడాన్ని ప్రోత్సహించి వారు కోలుకునేందుకు సాయం చేయాలి.
– ఆందోళన మొదలైతే.. నడవడం, ఆటలు ఆడటం వంటి రిలాక్సింగ్ యాక్టివిటీస్ వైపు వారి దృష్టి మరల్చేందుకు ప్రయత్నించాలి.
– రికవరీ ప్రాసెస్‌లో సాధించిన చిన్న చిన్న విషయాలను ప్రశంసిస్తూ.. మీరు వారి గురించి ఎంత గర్వపడుతున్నారో చెబుతుండాలి.

SADగా ఉన్న వ్యక్తికి ఏం చెప్పకూడదు?

– ఇది కేవలం సమావేశం/ప్రదర్శన/ఈవెంట్.
– మీది ఇలా ప్రవర్తించే వయసు కాదు.
– ఇలా జీవించడం మీకు చాలా కష్టంగా ఉండాలే.
– ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.
– ఇదంతా మీ మైండ్‌లోనే ఉంది.
– ఇతరులు ఏమనుకుంటారు?
– మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలుసు, నేను కూడా భయపడ్డాను.
– మీరు కొంచెం ఫ్రీగా ఉండాలి.
– మీ భయాలను ఎదుర్కోండి, అప్పుడే నేర్చుకోగలరు.
– మీకు ఏమైంది?
– మీరు మామూలుగా ఉండగలరా?
– మిమ్మల్ని మీరు అధిగమించినట్లుగా కనిపించాలి.

Tags:    

Similar News