Tinder : టిండర్‌లో ఐడీ వెరిఫికేషన్

దిశ, ఫీచర్స్ : ప్రముఖ డేటింగ్ యాప్ ‘టిండర్’.. రాబోయే త్రైమాసికాల్లో తన ప్లాట్‌ఫామ్స్‌లో ప్రపంచవ్యాప్త సభ్యులకు ఐడీ ధృవీకరణను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. 2019లో తొలిసారిగా జపాన్‌లో ఐడీ వెరిఫికేషన్ తీసుకొచ్చిన టిండర్.. నిపుణుల సిఫార్సులతో పాటు ఆయా దేశాల్లోని ముఖ్యమైన పత్రాలు, స్థానిక చట్టాలు, నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ఓ నిర్ణయానికి వస్తామని పేర్కొంది. ప్రస్తుతం 190 దేశాల్లో, 40 కంటే ఎక్కువ భాషల్లో టిండర్ యాప్ అందుబాటులో ఉంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక […]

Update: 2021-08-18 05:07 GMT

దిశ, ఫీచర్స్ : ప్రముఖ డేటింగ్ యాప్ ‘టిండర్’.. రాబోయే త్రైమాసికాల్లో తన ప్లాట్‌ఫామ్స్‌లో ప్రపంచవ్యాప్త సభ్యులకు ఐడీ ధృవీకరణను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. 2019లో తొలిసారిగా జపాన్‌లో ఐడీ వెరిఫికేషన్ తీసుకొచ్చిన టిండర్.. నిపుణుల సిఫార్సులతో పాటు ఆయా దేశాల్లోని ముఖ్యమైన పత్రాలు, స్థానిక చట్టాలు, నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ఓ నిర్ణయానికి వస్తామని పేర్కొంది.

ప్రస్తుతం 190 దేశాల్లో, 40 కంటే ఎక్కువ భాషల్లో టిండర్ యాప్ అందుబాటులో ఉంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన నాన్-గేమింగ్ యాప్‌గానూ టిండర్‌కు మంచి పేరుంది. 450 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్ సాధించిన ఈ యాప్.. 60 బిలియన్‌‌కు పైగా మ్యాచ్‌లకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే తమ వినియోగదారులకు ప్రైవసీ-ఫ్రెండ్లీ విధానాన్ని కల్పించడానికి ఐడీ వెరిఫికేషన్ తీసుకువస్తున్నట్లు తెలిపింది. రెండేళ్లుగా కస్టమర్ల అజ్ఞాతాన్ని తగ్గిస్తూ, జవాబుదారీతనం పెంచే ఫొటో వెరిఫికేషన్, నూన్‌లైట్, ఫేస్ టు ఫేస్ వీడియో చాట్ వంటి 10కి పైగా కీలక భద్రతా ఫీచర్లను రూపొందించింన టిండర్.. మరిన్ని ఫీచర్స్ తెచ్చే పనిలో ఉంది.

ధ్రువీకరణ ప్రక్రియ ద్వారా ప్రయోజనాలు..

ఐడి వెరిఫికేషన్ సంక్లిష్టమైనది, సూక్ష్మమైనది. అందుకే మేము రోల్ అవుట్ కోసం టెస్ట్-అండ్-లెర్న్ విధానాన్ని తీసుకుంటున్నాం. కస్టమర్స్‌కు సేఫ్టీ ప్లాట్‌ఫామ్ అందించేందుకు కృషి చేస్తున్నాం. ఇందులోని మ్యాచ్‌లు ప్రామాణికమైనవని. అయితే వారు ఎవరితో సంభాషిస్తారనే దానిపై మరింత నియంత్రణను కల్పించడం అవసరమని అనుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా సభ్యులందరూ ఐడీ ధృవీకరణ ప్రక్రియ ద్వారా వెళ్ళిన వ్యక్తులతో సంభాషించడం వల్ల కలిగే ప్రయోజనాలను త్వరలోనే చూస్తారని ఆశిస్తున్నాం.
– రోరీ కోజోల్, టిండెర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ ప్రొడక్ట్ హెడ్

నిపుణుల సలహాతో ముందుకెళ్తున్నాం..

ప్రపంచంలోని అనేక ప్రాంతాలు, సాంప్రదాయకంగా అట్టడుగున గల సమాజాల్లోని ప్రజలు.. తమ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై రియల్ వరల్డ్ ఐడెంటిటీని, వాస్తవాలను పంచుకోకపోవడానికి లేదా ఇష్టపడకపోవటానికి బలమైన కారణాలను కలిగి ఉంటారని మాకు తెలుసు. అందువల్ల ఐడీ ధృవీకరణ చేయడం మాకో సవాల్ వంటిది. కానీ ఈ క్లిష్టమైన భద్రతా ప్రాజెక్ట్ విధానంలో నిపుణుల సలహాలతో ముందుకు వెళ్తున్నాం.
– ట్రేసీ బ్రీడెన్, మ్యాచ్ గ్రూప్‌లో భద్రత, సామాజిక న్యాయవాది

Tags:    

Similar News