టిండర్‌లో ఇంటరాక్షన్ పెంచడానికి ‘వైబ్స్’ ఫీచర్

దిశ, ఫీచర్స్ : పాపులర్ డేటింగ్ సర్వీస్ ‘టిండర్’ ఈ నెలలోనే తమ లైవ్ ఈవెంట్ ఫీచర్ ‘వైబ్స్’‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇందులో బోలెడన్ని అప్లికేషన్స్ ఉండనుండగా.. వీటి నుంచి ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం కాస్త కష్టమైన పనే. ప్రతీ ఒక్కరికి వ్యక్తిగతంగా కొన్ని ఆసక్తులు ఉండే ఉంటాయి. వాటి ఆధారంగా లైక్ మైండెడ్ పీపుల్‌ను చేరువ చేయడానికి ‘వైబ్స్’ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ న్యూ ఫీచర్‌లో కొన్ని సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ […]

Update: 2021-05-07 08:06 GMT

దిశ, ఫీచర్స్ : పాపులర్ డేటింగ్ సర్వీస్ ‘టిండర్’ ఈ నెలలోనే తమ లైవ్ ఈవెంట్ ఫీచర్ ‘వైబ్స్’‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇందులో బోలెడన్ని అప్లికేషన్స్ ఉండనుండగా.. వీటి నుంచి ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం కాస్త కష్టమైన పనే. ప్రతీ ఒక్కరికి వ్యక్తిగతంగా కొన్ని ఆసక్తులు ఉండే ఉంటాయి. వాటి ఆధారంగా లైక్ మైండెడ్ పీపుల్‌ను చేరువ చేయడానికి ‘వైబ్స్’ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ న్యూ ఫీచర్‌లో కొన్ని సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి సమాధానాలు చెప్పిన యూజర్స్, తమ చాట్‌లో రిప్రజెంట్ చేసుకునే అవకాశముంది.

డేటింగ్ యాప్‌లో ఇంటారాక్షన్ పెంచడానికి టిండర్ ఇదివరకే ఇలాంటి ప్రయోగాలు చేసింది. గతేడాది ‘స్వైప్ నైట్’ పేరుతో ఇలాంటి సిరీస్‌నే తమ యాప్‌లో రన్ చేసింది. ఇందులో భాగంగా వినియోగదారులకు ‘వరల్డ్ ఎండింగ్’ టాపిక్ ఇవ్వగా, ముగింపును ప్రభావితం చేసే నిర్ణయాలను వాళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 13 మిలియన్ల మంది వినియోగదారులు పాల్గొన్నారు. స్వైప్ నైట్ మాదిరి ‘వైబ్స్’ను కూడా అలానే డిజైన్ చేసినా, ఇంటారాక్టివ్ పద్ధతి వేరేగా ఉంటుంది. ఇందులో పర్సనల్ ప్రిఫరెన్సెస్, టీవీ షోస్, మూవీస్, మ్యూజిక్ వంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు వినియోగదారులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమాధానాలు యూజర్ ప్రొఫైల్ మీద మూడు రోజుల పాటు కనిపిస్తాయి.

వైబ్స్ ఈవెంట్‌లో పాల్గొన్న యూజర్.. మరొక యూజర్ కామన్ ఇంట్రెస్ట్‌లతో సరిపోలితే, వారిని ప్రత్యేకంగా ‘మ్యూచువల్ వైబ్స్‌’గా టిండర్ ప్రకటిస్తుంది. అలా ఈ కొత్త ఫీచర్ యూజర్లకు మరింత ఆసక్తికరమైన సంభాషణలను పంచుకోవడానికి సాయపడుతుంది. వైబ్స్ ఈవెంట్ మొత్తంగా 48 గంటల పాటు లైవ్‌లో కొనసాగుతుంది. ఇందులో పార్టిసిపెంట్ చేసిన వారి రెస్పాన్స్ కోసం 72 గంటల పాటు వేచి ఉండొచ్చు. ఒకవేళ ఆ లోపు రిప్లయ్ రాకపోతే ఆ సమాధానాలు డిస్‌ప్లే నుంచి తీసేస్తారు. యూజర్ మళ్లీ కొత్త ప్రశ్నలతో ఈవెంట్ ప్రారంభమయ్యే వరకు వేచి ఉండాల్సిందే. ఈ నెల చివర్లో ప్రపంచ యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని టిండర్ పేర్కొంది.

Tags:    

Similar News