‘వైరస్‌ అంతం అయ్యేది అప్పుడే’

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో అడుగుపెట్టి జెండా పాతింది. రోజుకీ ఆయా దేశాల్లో వైరస్ వ్యాప్తిని పెంచుకుంటూ పోతోంది. కరోనా అంతంపై ఇప్పటికీ ఓ స్పష్టమైన నివేదిక రాలేదు. ఇక భారత్‌లో కూడా మహమ్మారి కొరలు చాస్తోంది. అయితే, భారత్‌లో కరోనా ఈ ఏడాది డిసెంబర్ 3 నాటికి అంతం అవుతోందని ‘టైమ్స్ ఫ్యాక్ట్-ఇండియా ఔట్ బ్రేక్’రిపోర్ట్ అంచనా వేసింది. అంతేకాకుండా.. ఏ ఏ నగరాల్లో కరోనా ఎప్పుడు అంతం అవుతుందో […]

Update: 2020-08-21 10:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో అడుగుపెట్టి జెండా పాతింది. రోజుకీ ఆయా దేశాల్లో వైరస్ వ్యాప్తిని పెంచుకుంటూ పోతోంది. కరోనా అంతంపై ఇప్పటికీ ఓ స్పష్టమైన నివేదిక రాలేదు. ఇక భారత్‌లో కూడా మహమ్మారి కొరలు చాస్తోంది. అయితే, భారత్‌లో కరోనా ఈ ఏడాది డిసెంబర్ 3 నాటికి అంతం అవుతోందని ‘టైమ్స్ ఫ్యాక్ట్-ఇండియా ఔట్ బ్రేక్’రిపోర్ట్ అంచనా వేసింది. అంతేకాకుండా.. ఏ ఏ నగరాల్లో కరోనా ఎప్పుడు అంతం అవుతుందో నివేదికలో వెల్లడించింది.

ఐఓఆర్ నివేదిక వివరాలు:
-ఇండియాలో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతం అయ్యే అవకాశం
-దేశంలో సెప్టెంబర్ 2 నాటికి వైరస్ పీక్ స్టేజ్‌కి వెళ్లే ఛాన్స్
-ఏపీలో ఆగస్టు 23 నాటికి వైరస్ తీవ్రత పెరుగుతోంది
-తెలంగాణలో ఆగస్టు 15 నాటికే వైరస్ వ్యాప్తి అధికమైంది

అలాగే, అక్టోబర్‌లో తెలంగాణ, చెన్నై.. నవంబర్‌లో ఏపీ, ముంబై, ఢిల్లీ, బెంగళూరులో వైరస్ తగ్గు ముఖం పడుతోందని నివేదిక అంచనా వేస్తోంది. ఇదే సమయంలో వైరస్ కూడా పూర్తిగా అంతం అయ్యే అవకాశం ఉన్నట్లు ఐఓఆర్ నివేదిక వెల్లడించింది

Tags:    

Similar News