ఇక టిక్ టాక్ వాడకం తల్లిదండ్రుల చేతుల్లో..

యువతలో అత్యంత ప్రాచుర్యం పొందుతున్న టిక్ టాక్ యాప్ నెమ్మదిగా కొత్త ప్రమాణాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. యువ వినియోగదారుల రక్షణే ధ్యేయంగా ఈ ప్రమాణాలను టిక్ టాక్ అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగా గతేడాది వయస్సు నిబంధనని, ఇటీవల నిషేధిత వీడియోల ప్రసారాన్ని కట్టడి చేసింది. ఇప్పుడు కొత్తగా పేరెంటల్ కంట్రోల్స్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పేరెంటల్ కంట్రోల్స్ సాయంతో టీనేజీలో ఉన్న తమ పిల్లలు చూసే టిక్ టాక్ వీడియోలను నియంత్రించవచ్చు. వారు ఎలాంటి వీడియోలు […]

Update: 2020-02-20 02:08 GMT

యువతలో అత్యంత ప్రాచుర్యం పొందుతున్న టిక్ టాక్ యాప్ నెమ్మదిగా కొత్త ప్రమాణాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. యువ వినియోగదారుల రక్షణే ధ్యేయంగా ఈ ప్రమాణాలను టిక్ టాక్ అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగా గతేడాది వయస్సు నిబంధనని, ఇటీవల నిషేధిత వీడియోల ప్రసారాన్ని కట్టడి చేసింది. ఇప్పుడు కొత్తగా పేరెంటల్ కంట్రోల్స్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ పేరెంటల్ కంట్రోల్స్ సాయంతో టీనేజీలో ఉన్న తమ పిల్లలు చూసే టిక్ టాక్ వీడియోలను నియంత్రించవచ్చు. వారు ఎలాంటి వీడియోలు చూడాలో తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు. అలాగే వారి టిక్ టాక్ యాప్‌లో డైరెక్టు మెసేజింగ్ సేవను కూడా అదుపు చేయవచ్చు. ఇవన్నీ ఫ్యామిలీ సేఫ్ మోడ్ యాక్టివేట్ చేయడం ద్వారా పొందవచ్చు. ఈ మోడ్‌లో పిల్లల టిక్ టాక్‌ను తల్లిదండ్రుల టిక్ టాక్ ఖాతాతో అనుసంధానించడం జరుగుతుంది. దీని ద్వారా తమ పిల్లలు ఎంత సేపు టిక్‌టాక్ వాడాలో కూడా తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు. ప్రస్తుతానికి యునైటెడ్ కింగ్‌డమ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కొత్త ఫీచర్‌ని త్వరలో అన్ని దేశాల్లోనూ అమలు చేయబోతున్నట్లు టిక్ టాక్ తెలిపింది.

Tags:    

Similar News