హైదరాబాద్‌లో థ్రిల్ సిటీ.. నెక్లెస్ రోడ్డులో మాయ ప్రపంచం..!
దిశ, వెబ్‌డెస్క్ : మినీ ఇండియాగా పేరుగాంచిన భాగ్యనగరంలో ప్రపంచం గర్వించదగ్గ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఐటీ ఉద్యోగులు, ఆహ్లాదం కొరుకునే కుటుంబాలతో వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో ఉండే సందడే వేరు. పబ్‌లు, ప్రకృతి వనాలు, పర్యాటక ప్రాంతాలు కొత్త అందాలు సంతరించుకుంటాయి. యూత్‌ను అమితంగా ఆకర్షించే ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ సరసనా మరో అద్భుతమైన పార్క్ చేరింది. అన్ని వర్గాలను అబ్బురపరిచే విధంగా థ్రిల్ సిటీని ఆవిష్కరించారు. ‘ఫ్యూచరిస్టిక్ అమ్యూజ్‌మెంట్ పార్క్’ పేరిట […]
దిశ, వెబ్‌డెస్క్ : మినీ ఇండియాగా పేరుగాంచిన భాగ్యనగరంలో ప్రపంచం గర్వించదగ్గ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఐటీ ఉద్యోగులు, ఆహ్లాదం కొరుకునే కుటుంబాలతో వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో ఉండే సందడే వేరు. పబ్‌లు, ప్రకృతి వనాలు, పర్యాటక ప్రాంతాలు కొత్త అందాలు సంతరించుకుంటాయి. యూత్‌ను అమితంగా ఆకర్షించే ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ సరసనా మరో అద్భుతమైన పార్క్ చేరింది. అన్ని వర్గాలను అబ్బురపరిచే విధంగా థ్రిల్ సిటీని ఆవిష్కరించారు.
‘ఫ్యూచరిస్టిక్ అమ్యూజ్‌మెంట్ పార్క్’ పేరిట నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా ఎదురుగా రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ థ్రిల్ సిటీని గత నెలలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ థ్రిల్ సిటీలో అన్ని రకాల విందు, వినోదాలతో అన్ని వయసుల వారు ఎంజాయ్ చేసేలా రూపొందించారు. ఈ థ్రిల్ సిటీలో ఆర్కేడ్ గేమ్‌లు, మోషన్ థియేటర్, స్ప్లాష్ వాటర్ రైడ్, VR గేమ్స్, ఫుడ్ కోర్ట్ ఉన్నాయి.
థ్రిల్ సిటీ ప్రత్యేకతలు ఇవే..
నీటి రైడ్.. దీనిలో ప్రజలు రైలులో కూర్చుంటారు. అది నీటి గుండా వెళుతుంది. అడ్వెంచర్స్ చేయడానికి భయపడే వారి కోసం VR రోలర్‌కోస్టర్ కూడా ఉంది. హార్రర్, థ్రిల్లర్, అడ్వెంచర్ సినిమాలు 3D విజువల్, మోషన్ ఎఫెక్ట్‌లతో ప్రదర్శించబడే మాన్‌స్టర్ థియేటర్ ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద 4DX మోషన్ థియేటర్. దీనిలో ఒకే ప్లాట్‌ఫామ్‌పై 104 మంది వీక్షించవచ్చు. 360-డిగ్రీ విజువల్స్ అందించే డోమ్ థియేటర్ కూడా ఉంది. క్రీడా ప్రియుల కోసం, పార్క్‌లో స్పోర్ట్స్ బార్, ఫుట్ బాల్ కోర్ట్ ఉంది. ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, క్రికెట్ పిచ్ కూడా ఉన్నాయి. వ్యాయామశాల, ఉష్ణోగ్రత-నియంత్రిత స్విమ్మింగ్ పూల్ తో పటు ఇతర సౌకర్యాలతో పర్యాటలకు అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం.. ఈ వీకెండ్ ఓ లుక్ వేద్దామా..!